చంద్రగిరి : చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ ఆర్‌ఎస్సై భాస్కర్ బృందం కూంబింగ్ నిర్వహించింది. ఆదివారం తెల్లవారుజామున కల్యాణి డ్యామ్ ఎగువ ప్రాంతమైన శేషాచలం అడవుల్లో తనిఖీలు చేపట్టారు. పుల్లయ్యగారి పల్లెగుట్ట వద్ద 10 మంది తమిళ కూలీలు ఎర్రచందనం దుంగలను పక్కన పెట్టి సేదతీరుతుండగా టాస్క్‌ఫోర్స్ బృందం వారిని చుట్టుముట్టింది. దీంతో కూలీలు చేతికందిన రాళ్లు తీసుకొని టాస్క్‌ఫోర్స్ బృందంపై దాడి చేస్తూ పారిపోయారు.
వారిలో ఒకరిని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై జిల్లా పోలార్ తాలూకా జావాధిమలైకు చెందిన అలగేశన్‌గా గుర్తించారు. ఆ ప్రాంతం నుంచి 9 ఎర్రచందనం దుంగలను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఎఫ్‌ఎస్‌వో వెంకటసుబ్బయ్య, ఏబీవో కోదండ, హెడ్‌కానిస్టేబుల్ మోహన్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ దాడులు
Published Sun, Sep 24 2017 1:08 PM | Last Updated on Sun, Sep 24 2017 1:08 PM
Advertisement