red sand
-
శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ దాడులు
చంద్రగిరి : చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్సై భాస్కర్ బృందం కూంబింగ్ నిర్వహించింది. ఆదివారం తెల్లవారుజామున కల్యాణి డ్యామ్ ఎగువ ప్రాంతమైన శేషాచలం అడవుల్లో తనిఖీలు చేపట్టారు. పుల్లయ్యగారి పల్లెగుట్ట వద్ద 10 మంది తమిళ కూలీలు ఎర్రచందనం దుంగలను పక్కన పెట్టి సేదతీరుతుండగా టాస్క్‌ఫోర్స్ బృందం వారిని చుట్టుముట్టింది. దీంతో కూలీలు చేతికందిన రాళ్లు తీసుకొని టాస్క్‌ఫోర్స్ బృందంపై దాడి చేస్తూ పారిపోయారు. వారిలో ఒకరిని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై జిల్లా పోలార్ తాలూకా జావాధిమలైకు చెందిన అలగేశన్‌గా గుర్తించారు. ఆ ప్రాంతం నుంచి 9 ఎర్రచందనం దుంగలను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఎఫ్ఎస్వో వెంకటసుబ్బయ్య, ఏబీవో కోదండ, హెడ్‌కానిస్టేబుల్ మోహన్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో ఎర్ర క్వీన్
చిత్తూరు: కోల్‌కత్తాకు చెందిన ఎర్ర చందనం మహిళా స్మగ్లర్ సంగీత చటర్జీని చిత్తూరు పోలీసులు మంగళవారం రాత్రి అదపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ లక్ష్మన్ రెండో భార్యే సంగీత. మోడల్‌గా, ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసిన సంగీతపై 2015లో చిత్తూరు జిల్లాలో రెండు ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. దీనిపై కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న సంగీతని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందం ఆమెను వెతుకుతూనే ఉంది. ప్రస్తుతం సంగీత పట్టుబడటంతో పెండింగ్ కేసులు కొలిక్కిరానున్నాయి. -
పోలీసుల అదుపులో ఎర్ర క్వీన్
-
ఎర్రచందనం పట్టివేత
భాకరాపేట(చిత్తూరు): చిత్తూరు జిల్లా యర్రావారిపాళెం మండలం తలకోన అటవీ ప్రాంతంలో రూ.కోటి విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిదిమంది స్మగ్లర్లును అరెస్టు చేసినట్లు పీలేరు రూరల్ సీఐ ఎం.మహేశ్వర్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం సాయంత్రం ఎర్రావారిపాళెం, రొంపిచెర్ల, కేవీపల్లె ఎస్ఐలు నరేంద్ర, రహీముల్లా, సుమన్, భాకరాపేట ఏఎస్ఐ వేణుగోపాల్‌రెడ్డి, సిబ్బందితో కలిసి తలకోన అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. అటవీ సరిహద్దు ప్రాంతమైన చిన్నరామాపురం సమీపంలోని మంగమ్మ చెరువు వద్ద ఎర్రచందనం దుంగలను తరలించేందుకు సిద్ధం చేస్తుండగా స్మగర్లపై దాడులు చేశారు. ఈ దాడుల్లో రెండు ద్విచక్రవాహనాలు, హోండా కారుతో పాటు టన్ను బరువు గల 37 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దుంగల విలువ రూ.కోటి, వాహనాల విలువ రూ.2లక్షలని సీఐ చెప్పారు. జిల్లాకు చెందిన స్మగ్లర్లు ఎల్.వాసుదేవప్రసాద్, డి.ముత్తుకుమార్, ఎం.ఆంజనేయులు, కె.దొరబాబు, వి.శ్రీనివాసులు, పి.బోయకొండ, కె.చెంచయ్య, డి. వెంకటయ్యలను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రధాన అనుచరులు పరారయ్యారు. -
ఎర్రచందనం కూలీల అరెస్ట్
నల్లచెరువు : నల్లచెరువు పాత రైల్వేస్టేషన్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఎర్ర చందనం చెట్టు నరికేందుకు వెళుతున్న ముగ్గురు కూలీలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ ప్రసాద్‌బాబు తెలిపారు. తమకు వచ్చిన సమాచారం మేరకు వాహనాల తనిఖీ చేస్తుండగా ద్విచక్రవాహనంలో వస్తున్న ఇద్దరు తప్పించుకుని వెళ్లారన్నారు. వీరి వెనుక టాటా çసుమో వాహనంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులైన ఎన్పీకుంటకు చెందిన కారుడ్రైవర్ లోకేశ్వరరెడ్డి, సాంబశివయ్య, కడపలవాండ్లపల్లికి చెందిన శ్రీనివాసులును ప్రశ్నించగా సమాధానం సక్రమంగా చెప్పలేదన్నారు. అనుమానం వచ్చి వాహనం తనిఖీ చేయగా అందులో ఎర్రచందనం చెట్లు నరికేందుకు తీసుకుపోతున్న గొడ్డళ్లు, ఇనుప రంపాలు కనిపించాయన్నారు. వారిని విచారించగా తమను ఎన్పీ కుంటకు చెందిన హరిబాబు, బద్రిలు తెలిపిన మేరకు సుండుపల్లి అడవులలో ఎర్రచందనం చెట్లు నరికేందుకు వెళుతున్నామని సమాధానం ఇచ్చారు. దీంతో వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండుకు ఆదేశించారు. -
తమిళ స్మగ్లర్ అరెస్ట్..
భాకరాపేట: చిత్తూరు జిల్లా భాకరాపేట మండలంలో అటవీశాఖ అధికారులు సోమవారం ఉదయం తమిళనాడుకు చెందిన ఓ ఎర్రచందనం స్మగ్లర్‌ను అరెస్టు చేశారు. పక్కా సమాచారం మేరకు దేవరకొండ - మేదరపల్లి రోడ్డులో ఎర్రచందనం దుంగలను వాహనాల్లో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన వసంత అనే స్మగ్లర్‌ను అరెస్టు చేయడంతో పాటు, రెండు కార్లు, ఓ ద్విచక్ర వాహనం, 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. -
ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు పోలీసులు ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను శుక్రవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2.80 లక్షల విలువజేసే 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాటా మ్యాజిక్ వాహనంలో ఎర్రచందనం దుంగలను బెంగళూరుకు తరలిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. నిందితులు నర్మదాకుమారి, ఆమె భర్త నాగేంద్రప్రసాద్, మంగలి ప్రసాద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.