ఎర్రచందనం కూలీల అరెస్ట్‌ | red sand smugglers arrest | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం కూలీల అరెస్ట్‌

Published Wed, Nov 30 2016 11:27 PM | Last Updated on Mon, Oct 22 2018 1:59 PM

ఎర్రచందనం కూలీల అరెస్ట్‌ - Sakshi

ఎర్రచందనం కూలీల అరెస్ట్‌

నల్లచెరువు : నల్లచెరువు పాత రైల్వేస్టేషన్‌ వద్ద బుధవారం తెల్లవారుజామున ఎర్ర చందనం చెట్టు నరికేందుకు వెళుతున్న ముగ్గురు కూలీలను పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ ప్రసాద్‌బాబు తెలిపారు. తమకు వచ్చిన సమాచారం మేరకు వాహనాల తనిఖీ చేస్తుండగా ద్విచక్రవాహనంలో వస్తున్న ఇద్దరు తప్పించుకుని వెళ్లారన్నారు. వీరి వెనుక టాటా çసుమో వాహనంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులైన ఎన్‌పీకుంటకు చెందిన కారుడ్రైవర్‌ లోకేశ్వరరెడ్డి, సాంబశివయ్య, కడపలవాండ్లపల్లికి చెందిన శ్రీనివాసులును ప్రశ్నించగా సమాధానం సక్రమంగా చెప్పలేదన్నారు.

అనుమానం వచ్చి వాహనం తనిఖీ చేయగా అందులో ఎర్రచందనం చెట్లు నరికేందుకు తీసుకుపోతున్న గొడ్డళ్లు, ఇనుప రంపాలు కనిపించాయన్నారు. వారిని విచారించగా తమను ఎన్‌పీ కుంటకు చెందిన హరిబాబు, బద్రిలు తెలిపిన మేరకు సుండుపల్లి అడవులలో ఎర్రచందనం చెట్లు నరికేందుకు వెళుతున్నామని సమాధానం ఇచ్చారు. దీంతో వారిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్‌ రిమాండుకు ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement