
పోలీసుల అదుపులో ఎర్ర క్వీన్
చిత్తూరు: కోల్‌కత్తాకు చెందిన ఎర్ర చందనం మహిళా స్మగ్లర్ సంగీత చటర్జీని చిత్తూరు పోలీసులు మంగళవారం రాత్రి అదపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ లక్ష్మన్ రెండో భార్యే సంగీత. మోడల్‌గా, ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసిన సంగీతపై 2015లో చిత్తూరు జిల్లాలో రెండు ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. దీనిపై కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న సంగీతని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందం ఆమెను వెతుకుతూనే ఉంది. ప్రస్తుతం సంగీత పట్టుబడటంతో పెండింగ్ కేసులు కొలిక్కిరానున్నాయి.