తిరుమలలో శేషాచల అటవీ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
తిరుమలలో శేషాచల అటవీ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జపాలికి నడచి వెళ్లే మార్గంలో గౌతమీ వనం వద్ద మొదలైన మంటలు పక్కనున్న ప్రాంతాలకు విస్తరించాయి. సమాచారం అందుకున్నఅటవీ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. సుమారు మూడు హెక్టార్ల ప్రాంతంలో విలువైన వృక్ష సంపద బుగ్గిపాలైంది.