'ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది'
Published Mon, Oct 24 2016 3:10 PM | Last Updated on Thu, Mar 28 2019 5:23 PM
ఏఓబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. మృతదేహాలను గురువారం వరకు భద్రపరచాలని కోర్టు ఆదేశించింది. ఈ ఎన్‌కౌంటర్‌లోఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఉన్నారన్న సమాచారం ఇంకా స్పష్టంగా తెలియదని ఏపీ ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఇంకా అక్కడ ఎవరెవరు ఉన్నారో కూడా సమాచారం లేదని కోర్టుకు చెప్పారు. ఆపరేషన్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కి తరలించాలని పిటిషన్ దాఖలు చేసిన పౌరహక్కుల నేత చిలుకా చంద్రశేఖర్ కోర్టును కోరారు.
ఏపీ గ్రేహౌండ్స్ పోలీసులు తమ పరిధిని దాటి పది కిలోమీటర్ల వరకు వెళ్లి ఎన్‌కౌంటర్ చేశారని ఆయన అన్నారు. మావోయిస్టులు అక్కడ సమావేమయ్యారని తెలిసినప్పుడు వారిని అరెస్టు చేయొచ్చని, కానీ ఎన్‌కౌంటర్ పేరుతో హతమార్చారని ఆరోపించారు. పోలీసులపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసులు నమోదుచేయాలని పౌరహక్కుల సంఘం పిటిషన్ దాఖలుచేసింది.
Advertisement
Advertisement