
మావోయిస్టు అగ్రనేత ఆర్కే
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య గురువారం ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్లు సమాచారం ఉంది. బలిమెల రిజర్వాయర్ పరిధిలోని జొడాంబో ఏరియా - సిమిలి పొదరల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టు నాయకుడు ఆర్కేతో పాటు మరో ఇద్దరు ప్రముఖ నేతలు కూడా ఎదురుకాల్పుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒడిశా పోలీసులతో పాటు ఆంధ్రప్రదేశ్ గ్రే హౌండ్స్ బలగాలు ఉన్నాయి.
గత నెలలో మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవులు, చత్తీస్‌గఢ్‌లోని గోదావరి పరివాహాక ప్రాంతాల్లో పోలీసులకు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మరణించారు. గడ్చిరోలి ప్రాంతంలో 38 ఏళ్ల క్రితం ప్రారంభమైన గడ్చిరోలి తిరుగుబాటు ఉద్యమం చరిత్రంలో ఇదే అతి పెద్ద ఎన్‌కౌంటర్.
చదవండి : ముప్పేట దాడిలో 37 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment