సాక్షి, హైదరాబాద్: మేళ్లమడుగు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన 9 మంది సీపీఐ(ఎంఎల్) చండ్ర పుల్లారెడ్డి బాట దళ సభ్యుల మృతదేహాలకు నిర్వహించిన పోస్టుమార్టం తాలుకు నివేదికను, సీడీలను ప్రభుత్వం శుక్రవారం హైకోర్టు ముందుంచింది. ఈ ఘటనపై పిటిషనర్ కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని కోరుతున్న నేపథ్యంలో, పూర్తి వివరాలను కౌంటర్ రూపంలో తమ ముందుంచాలని ప్రభు త్వాన్ని ఆదేశించింది. ఈ కౌంటర్‌ను పరిశీలించిన తర్వాత దర్యాప్తుపై ఓ నిర్ణయం తీసుకుంటామంది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని, దీనిపై సీబీఐ లేదా సిట్‌తో దర్యాప్తు చేయించి, ఆ దర్యాప్తును పర్యవేక్షించాలని అభ్యర్ధిస్తూ పౌర హక్కుల కమిటీ అధ్యక్షుడు జి.లక్ష్మణ్ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది.
కోర్టు ముందుకు పోస్టుమార్టం నివేదిక
Published Sat, Dec 23 2017 3:24 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment