రాజయ్య కుటుంబానికి బెయిల్ నిరాకరణ
వరంగల్ లీగల్: వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, అయన భార్య మాధవి, కుమారుడు అనిల్‌కుమార్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను బుధవారం రెండవ అదనపు జిల్లా కోర్టు జడ్జి యార రేణుక తిరస్కరించారు. గత సంవత్సరం నవంబర్ 4న అర్ధరాత్రి రాజయ్య కోడలు, ఆమె మనవళ్లు మతిచెందడంపై అనిల్‌కుమార్, రాజయ్య, మాధవి, అనిల్‌కుమార్ రెండో భార్య సనాలపై కేసు నమోదు చేశారు.
బెయిల్ కోసం రాజయ్య, మాధవిలు ఇప్పటి వరకు నాలుగుమార్లు, అనిల్‌కుమార్ మూడవసారి కోర్టును ఆశ్రయించగా కోర్టు బెరుుల్ తిరస్కరించింది. కేసు విచారణ కొనసాగుతుందని ఇంకా రిపోర్టులు రావాల్సి ఉందని, నిందుతులకు బెయిల్ ఇస్తే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.