వరంగల్ కేంద్ర కారాగారంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు ఖైదీ నంబర్ 297
వరంగల్ కేంద్ర కారాగారంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు ఖైదీ నంబర్ 2971, ఆయన భార్య మాధవికి 7856, కుమారుడు అనిల్‌కు 2970 నంబర్లు కేటాయించారు. సారిక, ముగ్గురు పిల్లల సజీవ దహనం కేసులో వీరిపై ఐపీసీ 306, 498 ఏ, సీఆర్‌పీసీ 174 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు కాగా, 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. వీరిలో అనిల్ ఏ-1, రాజయ్య, మాధవి, అనిల్ రెండో భార్య సన ఏ-2, ఏ-3, ఏ-4 నిందితులుగా ఉన్నారు. కాగా, గృహహింస చట్టం కింద కేసు నమోదు కావడంతో రాజయ్యను కాంగ్రెస్ నుంచి బహిష్కరించే యోచనలో పీసీసీ ఉన్నట్లు తెలిసింది.
ఇక రాజయ్య భార్య మాధవి యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ బయోటెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు 48 గంటలు రిమాండ్ ఖైదీగా ఉంటే సస్పెండ్ చేయాలనే నిబంధనలు ఉండగా.. శనివారం ఆమెకు బెయిల్ రాకుంటే యూనివర్సిటీ అధికారులు సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉంది.