Warangal Central Prison
-
21న భూమిపూజ: ఓరుగల్లు ఒడిలో అత్యాధునిక వైద్యం..
హైదరాబాద్ నుంచి కూడా రోగులు వైద్యం కోసం వరంగల్‌కు వెళ్లే పరిస్థితి ఉండేలా ఈ ఆస్పత్రిలో ఏర్పాట్లు చేయనున్నారు. సీజనల్ వ్యాధుల కాలంలో ఖమ్మం, వరంగల్ జిల్లాలు, పక్క రాష్ట్రాల గిరిజన ప్రాంతాలు, ఇతరచోట్ల నుంచి ఎయిర్ అంబులెన్సుల్లో రోగులను ఇక్కడకు తరలించేలా హెలీప్యాడ్ ఏర్పాటు ఎలాంటి వైరస్లు వచ్చినా వాటికి దీటుగా చికిత్స అందించేలా, పరీక్షలు నిర్వహించేలా సదుపాయాలు సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా, ఎయిమ్స్ ఆస్పత్రులను సైతం తలదన్నేలా.. వరంగల్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి భూమిపూజ చేయనున్నారు. దీనిని తన కలల ప్రాజెక్టుగా భావిస్తున్న సీఎం.. ఉత్తర తెలంగాణకే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఈ ఆస్పత్రిని తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు. దీని కోసం ఏకంగా 24 అంతస్తుల భవనం నిర్మించాలని, చివరి అంతస్తు పైభాగంలో హెలీప్యాడ్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఇలాంటి ఆసుపత్రి దేశంలో ఎక్కడా లేదని, కెనడాలో ఉన్న ఒక ఆసుపత్రిని మోడల్‌గా తీసుకొని దీన్ని తీర్చిదిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారు. కెనడా వెళ్లి ఆ ఆసుపత్రిని పరిశీలించి రావాలని సూచించారు. ముఖ్యమంత్రే వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలు చూస్తున్నందున ఈ ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంటుందని అధికారులు అంటున్నారు. మొత్తం ఈ ఆసుపత్రి నిర్మాణానికి, అందులో అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుకు దాదాపు రూ.1,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. పది సూపర్ స్పెషాలిటీ విభాగాలు వరంగల్‌లోని సెంట్రల్ జైలు స్థానంలో, 59 ఎకరాల విస్తీర్ణంలో ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తారు. రెండు వేల పడకల సామర్థ్యంతో తీర్చిదిద్దనున్నారు. ఇందులో సుమారు 34 వరకు విభాగాలు ఉంటాయి. దాదాపు 500 మంది వరకు వైద్యులు, వెయ్యి మంది వరకు నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది పనిచేస్తారు. మొత్తం పది సూపర్ స్పెషాలిటీ విభాగాలు రోగులకు సేవలందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఎండోక్రై నాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వంటి మొత్తం పది సూపర్ స్పెషాలిటీ విభాగాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు దాదాపు ఐదు అంతస్తుల్లో ప్రత్యేకంగా అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాట్లు చేస్తారు. ఆక్సిజన్, వెంటిటేటర్ సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా విదేశాల నుంచి వైద్య పరికరాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తిగా పర్యావరణ హితంగా నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రిలో రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా, ప్రతి అంతస్తులోనూ బాగా గాలీ వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
జైలులో నయీమ్ అనుచరులకు వసతులు
-
జైలులో నయీమ్ అనుచరులకు వసతులు
వరంగల్ సెంట్రల్ జైలు జైలర్ గోపిరెడ్డి బదిలీ వరంగల్: వరంగల్ సెంట్రల్ జైలులో గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరులు పాశం శ్రీనివాస్, సందెల సుధాకర్లకు సకల సౌకర్యాలు కల్పించడమే కాకుండా వారికి సెల్ ఫోన్లను జైలర్ గోపిరెడ్డి సమకూర్చినట్లు సిట్ విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. దీంతో జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ జైలర్ గోపిరెడ్డిని జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నయీమ్ ప్రధాన అనుచరులైన పాశం శ్రీనివాస్, సందెల సుధాకర్‌లను హైదరాబాద్‌లో అరెస్టు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. వీరికి జైలులో విలాసవంతమైన సౌకర్యాలు, సెల్ ఫోన్లను అందించేందుకు పాశం శ్రీనివాస్ స్నేహితుడు పులి నాగరాజు జైలర్ గోపిరెడ్డిని కలుసుకున్నారు. ప్రస్తుతం ఈ జైలులో ఉన్న వీరికి సౌకర్యాలు కల్పిం చేందుకు జైలర్ గోపిరెడ్డి.. నాగరాజుతో రూ.7.50లక్షలకు ఒప్పందం కుదుర్చు కున్నారు. ఈ మేరకు జూలై 15న డబ్బులు ముట్టినట్లు సమాచారం. దీంతో వీరికి ప్రత్యేక సౌకర్యాలు, ఆహార పదార్థాలు, సెల్ఫోన్లను సమకూర్చడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎప్పుడు పడితే అప్పుడు శ్రీనివాస్, సుధాకర్‌లను కలిసేందుకు ములాఖత్‌లను గోపిరెడ్డి ఏర్పాటుచేసినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. ఈ ఆరోపణలతో పాటు సెంట్రల్ జైలు నుంచి నవంబర్ 12న శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు జైలు నుంచి తప్పించుకుపోరుున ఘటనలో గోపిరెడ్డి నిర్లక్ష్యం ఉన్నట్లు విచారణలో తేలింది. నయీమ్‌పై విచారణ జరిపిన సిట్ నివేదిక, సెంట్రల్ జైలులో ఖైదీలు తప్పించుకున్న ఘటనపై జరిగిన విచారణల నివేదికలతో గోపిరెడ్డిని వెంటనే ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని డీజీ వికే సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
జైళ్లలో భద్రత పటిష్టం చేయాలి
పోచమ్మమైదాన్ : జైళ్లలో భద్రత విషయంలో రాజీ పడకుండా సమర్థవంతంగా నిర్వహించాలని జైళ్ళ శాఖ డీఐజీ కేశవ నాయుడు అన్నారు. వరంగల్‌లోని కేంద్ర కారాగారంలో వరంగల్ రేంజ్ లెవల్ సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ శనివారం జరిగింది. ఈ సందర్భంగా కేశవనాయుడు మాట్లాడుతూ జైళ్లలో నిత్యం తనిఖీలు నిర్వహించాలని, ఈ మేరకు సూపరింటెండెంట్లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే కారాగారాల్లో ఎటువంటి అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. జైళ్లలో చేపడుతున్న నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన అదేశించారు. అనంతరం జైళ్లలో చేపడుతు న్న పలుఅంశాలపై చర్చించారు. సమావేశంలో ఐదు జిల్లాలజైలు అధికారులు న్యూ టన్ , భాస్కర్, మల్లారెడ్డి,రామచంద్రం, సమ్మయ్య, వెంకటేశ్వర్లు, రంగరావు పాల్గొన్నారు. -
అండర్ ట్రయల్ ఖైదీ మృతి
పోచమ్మమైదాన్ : వరంగల్ కేంద్ర కారాగారంలో అండర్ ట్రయల్ ఖైదీ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్టేషన్ ఘన్పూర్ మండలంలోని కొండాపూర్ గ్రామంకు చెందిన వెంకటయ్య (39) 2015 సంవత్సరం సెప్టెంబర్‌లో భార్యను చంపిన కేసులో రిమాండ్ నిమిత్తం వచ్చాడు. బెయిల్ కోసం ఎవరూ షూరిటీ ఇవ్వకపోవడంతో జైలులోనే ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్నం గుండెనొప్పి వస్తుందని చెప్పడంతో జైలు సిబ్బంది వెంకటయ్యను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. వెంటనే జైలు సిబ్బంది వెంకటయ్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. -
నగర శివారుకు సెంట్రల్ జైలు
జైలు ఆవరణలో యూనివర్సిటీ భవనం 70 ఎకరాల విస్తీర్ణంలో ఎంజీఎం ట్విన్ టవర్స్ 2000 పడకలకు విస్తరించనున్న ఎంజీఎం మామునూరుకు తరలనున్న సెంట్రల్ జైలు సాక్షి, హన్మకొండ : నగరం నడిబొడ్డున ఉన్న వరంగల్ కేంద్ర కారాగారం శివారుకు తరలిపోనుంది. సెంట్రల్ జైలు విస్తరించి ఉన్న 70 ఎకరాల స్థలంలో ఎంజీఎం ఆస్పత్రి ట్విన్ టవర్స్, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన యూనివర్సిటీకి కేటాయించనున్నారు. ఈ అంశం ఇప్పటి వరకు ప్రతిపాదనలన దశలో ఉండగా బుధవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి దీనిపై స్పష్టత ఇచ్చారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర ఆర్యోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శాఖాపరమైన వ్యవహారాలపై దృష్టిసారించారు. వరంగల్ సెంట్రల్ జైలు ప్రస్తుతం 70 ఎకరాల ప్రాంగణంలో విస్తరించి ఉంది. ఇందులో 35 ఎకరాల విస్తీర్ణంలో కాళోజీ హెల్త్ వర్సిటీకి కేటాయించాలని నిర్ణయించారు. కాళోజీ వర్సిటికి సంబంధించిన పరిపాలన భవన నిర్మాణం, ఇతర సదుపాయాలకు ఈ స్థలాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం రీజనల్ ఆస్పత్రిగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రి స్థాయిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న వేయి పడకల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని సంకల్పించింది. ఈ రెండు వేల పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని ఆధునిక హంగులతో ట్విన్ టవర్స్‌గా నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో మల్టీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలు కొనసాగుతాయి. మల్టీ స్పెషాలిటీ విభాగంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, పాథాలజీ, ఈఎన్టీ (చెవి,ముక్కు,గొంతు), మైక్రో బయాలజీ, పాథాలజీ, బయోమెడికల్, శస్త్ర చికిత్స విభాగాలు కొనసాగుతాయి. సూపర్ స్పెషాలిటీ విభాగంలో కార్డియాలజీ, అంకాలజీ(క్యాన్సర్), గ్యాస్ట్రో (జీర్ణకోశ), ఎండ్రోకైనాలజీ, న్యూరో, ప్లాస్టిక్ సర్జన్ లతో పాటు ఇంటెన్సివ్ కార్డియోథోరియాసిక్ యూనిట్, కార్డియో థోరియాసిక్ సర్జన్ విభాగాలు కొనసాగుతాయి. మాతాశిశు ఆస్పత్రిగా.. అధునాత ఎంజీఎం ఆస్పత్రి ట్విన్ టవర్స్‌లోకి మారితే, ప్రస్తుతం ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని పూర్తి స్థాయిలో మాతా శిశు ఆస్పత్రి (ఎంసీహె^Œ , మెటర్నల్ చైల్డ్ హెల్త్) గా మారుస్తారు. ఇందులో గైనకాలజీ ( స్త్రీల సంబంధిత ఆరోగ్య సమస్యల విభాగం) పీడియాట్రిక్ (పిల్లలు) విభాగాలు కొనసాగుతాయి. పీడియాట్రిక్ విభాగంలో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్ (నవజాత శిశువు) యూనిట్లు ఉంటాయి. అంతేకాకుండా వేర్వేరుగా వంద పడకల సామర్థ్యం కలిగిన హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, వరంగల్ సీకేఎం (చందా కాంతాయ్య మెమోరియల్) ఆస్పత్రులను ఎంజీఎం భవనాల్లోకి మారుస్తారు. 500 పైచిలుకు పడకల సామర్థ్యంతో ఎంజీఎం హాస్పిటల్లో ప్రాంతీయ మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి పనిచేస్తుంది. అనంతరం హన్మకొండ ప్రసూతి ఆస్పత్రి, సీకేఎం ఆస్పత్రులు జనరల్ ఆస్పత్రులగా మారుతాయి. మామునూరుకు .. నగరం మధ్యలో ఉన్న సెంట్రల్ జైలును మామునూరుకు తరలిస్తారు. నాలుగో పోలీస్ బెటాలియన్ సమీపంలో సెంట్రల్ జైలును ఏర్పాటు చే సేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇటీవల హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది జైలు తరలింపు అంశంపై క్షేత్రస్థాయి పర్యటన జరిపారు. -
రాజయ్యకు ఖైదీ నంబర్ 2971
-
ఖైదీ నంబర్ 2971
వరంగల్ కేంద్ర కారాగారంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు ఖైదీ నంబర్ 2971, ఆయన భార్య మాధవికి 7856, కుమారుడు అనిల్‌కు 2970 నంబర్లు కేటాయించారు. సారిక, ముగ్గురు పిల్లల సజీవ దహనం కేసులో వీరిపై ఐపీసీ 306, 498 ఏ, సీఆర్పీసీ 174 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు కాగా, 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. వీరిలో అనిల్ ఏ-1, రాజయ్య, మాధవి, అనిల్ రెండో భార్య సన ఏ-2, ఏ-3, ఏ-4 నిందితులుగా ఉన్నారు. కాగా, గృహహింస చట్టం కింద కేసు నమోదు కావడంతో రాజయ్యను కాంగ్రెస్ నుంచి బహిష్కరించే యోచనలో పీసీసీ ఉన్నట్లు తెలిసింది. ఇక రాజయ్య భార్య మాధవి యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ బయోటెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు 48 గంటలు రిమాండ్ ఖైదీగా ఉంటే సస్పెండ్ చేయాలనే నిబంధనలు ఉండగా.. శనివారం ఆమెకు బెయిల్ రాకుంటే యూనివర్సిటీ అధికారులు సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉంది. -
ఉగ్రమూక ఖతం
వరంగల్- నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో ఉగ్రమూకను పోలీసులు మట్టుబెట్టారు. టంగుటూరు శివారులోని జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన కాల్పుల్లో పేరుమోసిన ఉగ్రవాది వికారొద్దీన్ సహా ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. పలు కేసుల విచారణ నిమిత్తం వీరిని వరంగల్ సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు తరలిస్తుండగా ఎన్కౌంటర్ జరిగింది. ఎంజీఎం మార్చురీకి మృతదేహాలు ఎంజీఎం: వరంగల్-నల్గొండ జిల్లా సరిహద్దులో పోలీసుల కాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల మృతదేహాలను రాత్రి 11.30 గంటల సమయంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య వరంగల్ ఎంజీఎం మార్చురీకి తీసుకువచ్చారు. జనగామ ఏరియా ఆస్పత్రిలోని మార్చరీలో డిఫ్రిజిలేటర్లు లేకపోవడం వల్ల ఎంజీఎం మార్చరీకి తరలించారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించేవంత వరకు ఇక్కడే భద్రపరుస్తారు. మార్చరీ వద్ద వరంగల్ డీఎస్పీ సురేంద్రనాథ్, క్రైం డీఎస్పీ, మట్టెవాడ సిఐ శివరామయ్యలతో పాటు మిల్స్‌కాలనీ, ఇంతేజార్ గంజ్ పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.