ఉగ్రమూక ఖతం | 5 Suspected Terrorists Killed in Encounter in Telangana | Sakshi
Sakshi News home page

ఉగ్రమూక ఖతం

Published Wed, Apr 8 2015 4:09 AM | Last Updated on Sat, Aug 11 2018 8:07 PM

ఉగ్రమూక ఖతం - Sakshi

ఉగ్రమూక ఖతం

 వరంగల్- నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో ఉగ్రమూకను పోలీసులు మట్టుబెట్టారు.
 టంగుటూరు శివారులోని జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన  కాల్పుల్లో
 పేరుమోసిన ఉగ్రవాది వికారొద్దీన్ సహా ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు.
 పలు కేసుల విచారణ నిమిత్తం వీరిని వరంగల్ సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్ నాంపల్లి
 కోర్టుకు తరలిస్తుండగా ఎన్‌కౌంటర్ జరిగింది.

 
 ఎంజీఎం మార్చురీకి మృతదేహాలు
 ఎంజీఎం: వరంగల్-నల్గొండ జిల్లా సరిహద్దులో పోలీసుల కాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల మృతదేహాలను రాత్రి 11.30 గంటల సమయంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య వరంగల్ ఎంజీఎం మార్చురీకి తీసుకువచ్చారు. జనగామ ఏరియా ఆస్పత్రిలోని మార్చరీలో డిఫ్రిజిలేటర్లు లేకపోవడం వల్ల ఎంజీఎం మార్చరీకి తరలించారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించేవంత వరకు ఇక్కడే భద్రపరుస్తారు. మార్చరీ వద్ద వరంగల్ డీఎస్పీ సురేంద్రనాథ్, క్రైం డీఎస్పీ, మట్టెవాడ సిఐ శివరామయ్యలతో పాటు మిల్స్‌కాలనీ, ఇంతేజార్ గంజ్ పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement