నారాయణ కళాశాలలో విద్యార్థినుల మృతిపై త్వరలోనే నిజానిజాలు వెల్లడవుతాయని డీఐజీ రమణ కుమార్ తెలిపారు.
చింతకొమ్మదిన్నె (వైఎస్సార్ జిల్లా) : నారాయణ కళాశాలలో విద్యార్థినుల మృతిపై త్వరలోనే నిజానిజాలు వెల్లడవుతాయని డీఐజీ రమణ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన కడప సమీపంలోని కృష్ణాపురం వద్దనున్న నారాయణ జూనియర్ కళాశాలకు ఎస్పీ నవీన్ గులాటితో కలసి వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులు మృతి చెందిన స్థలాన్ని పరిశీలించారు. కళాశాల యాజమాన్యం, హాస్టల్ సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థినుల మరణాలకు గల కారణాలు పోస్టుమార్టం నివేదిక అందిన అనంతరమే వెల్లడవుతాయని తెలిపారు.