హైదరాబాద్ : లక్షలాదిమంది డిపాజిటర్ల డబ్బును గోల్మాల్ చేసిన అక్షయ గోల్డ్ కేసుపై హైకోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం విదితమే. విచారణ సందర్భంగా గురువారం.. ప్రతి వాయిదాకు యాజమాన్యం తప్పక హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఆస్తుల డాక్యుమెంట్లను ఎందుకు ఇవ్వలేదంటూ కోర్టు ప్రశ్నించింది. అక్షయ గోల్ట్ పై చర్యలు తీసుకోవాలని సీఐడీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా తదుపరి విచారణను మార్చి 24కు వాయిదా వేసింది.