వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై ఆర్డీవో విచారణ | RDO trial on Vikaruddin encounter | Sakshi
Sakshi News home page

వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై ఆర్డీవో విచారణ

Published Thu, May 7 2015 9:03 PM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM

RDO trial on Vikaruddin encounter

నల్లగొండ: గత నెల 7న నల్లగొండ జిల్లా ఆలేరులోని కందిగడ్డతండా శివారులో తీవ్రవాది వికారుద్దీన్, అతని అనుచరుల ఎన్‌కౌంటర్‌పై గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నల్లగొండ ఆర్డీవో వెంకటాచారి విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి 22 మందికి నోటీసులు జారీ చేయగా గురువారం విచారణకు 8 మంది హాజరయ్యారు. హాజరైన వారిలో నలుగురు వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు ఉన్నారు.

కాగా, మిగతా నలుగురు పోలీసు సిబ్బంది. ఆర్డీవో వెంకటాచారి వారి నుంచి వాంగ్ములాలను తీసుకున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆలేరుకు చేరుకున్న ఆర్డీవో సాయంత్రం 5 గంటల వరకు తహశీల్దార్ కార్యాలయంలోనే ఉన్నారు. శుక్రవారం కూడా విచారణ కొనసాగుతుందని ఆయన తెలిపారు.
(ఆలేరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement