vikaruddin encounter
-
తెలంగాణలో సంచలన ఎన్కౌంటర్లు ఇవే!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏడు ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి. అన్నీ సంచలన కేసులే కావడం గమనార్హం. వీరిలో నలుగురు మావోయిస్టులు, పేరుమోసిన మాఫియాడాన్, రెండు ఘటనల్లో సిమీ ఉగ్రవాదులు ఉన్నారు. 2015, ఏప్రిల్ 4 : తెలంగాణలో తొలి ఎన్ కౌంటర్ జరిగింది. నల్లగొండ సిమీ ఉగ్రవాదుల సంచారంతో వణికిపోయింది. 2013లో మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి పారిపోయిన ఐదుగురిలో ఇద్దరు ఉగ్రవాదులు సూర్యాపేటలో బస్సులు తనిఖీ చేస్తున్న సమయంలో పోలీసులపైకి కాల్పులు జరిపి పారిపోయారు. జానకీపురం గ్రామంలో పోలీసులతో జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సిమీ ఉగ్రవాదులు హతమయ్యారు. 2015, ఏప్రిల్ 7 : సిమీ ఉగ్రవాది వికారుద్దీన్ అతని నలుగురు సహచరులను హైదరాబాద్‌లోని కోర్టుకు తీసుకువస్తుండగా ఆలేరు సమీపంలో పోలీసులపైకి దాడికి దిగారు. ఉగ్రవాదులు ఫైర్ ఓపెన్ చేయడంతో పోలీసులు ఎదురుకాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో వికారుద్దీన్‌తోపాటు నలుగురు సహచరులు మరణించారు. 2015, సెప్టెంబర్ 15 : ఉమ్మడి వరంగల్ జిల్లా వెంగళాపూర్ వద్ద మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పో యారు. వీరిలో ఒకరు మహిళ. 2016, ఆగస్టు 8 : షాద్‌నగర్ సమీపంలోని మిలీనియా టౌన్షిప్ పరిసరాల్లో జరిగిన ఎన్కౌంటర్లో మాఫియాడాన్ నయీముద్దీన్ అలియాస్ నయీమ్ హతమయ్యాడు. 2019, జూలై 31 : కొత్తగూడెం జిల్లా రోళ్లగూడెం వద్ద జరిగిన ఎన్కౌంటర్లో న్యూడెమోక్రసీ నేత లింగన్న హతమయ్యాడు. 2019–20 : మణుగూరు మండలం బూరుగుల గ్రామంలో జాడి వీరాస్వామి అలియాస్ రఘును మట్టుబెట్టారు. 2019, డిసెంబర్ 6 : దిశ కేసులో ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు చటాన్‌పల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. -
చిత్తూరు కోర్టులో పేలుడు వెనుక ఉగ్రవాస్తం!
-ఉగ్రవాద నీడలపై పోలీసుల చూపు - వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌తో సంబంధం - ఏడాది క్రితం ఎన్కౌంటర్.. అదే తేదీన కోర్టులో పేలుడు - తమిళనాడు జైళ్లకు పలు లేఖలు - ప్రధాన నిందితుడు ‘సిద్దికి’పై అనుమానాలు - రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు చిత్తూరు (అర్బన్): చిత్తూరు కోర్టులో జరిగిన బాంబు పేలుడు ఘటనలో లాగే కొద్ది కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ పేలుడుకు ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందని ప్రాథమికంగా నిర్దారించుకున్న పోలీసులకు మరిన్ని ఆధారాలు లభించాయి. 2015 ఏప్రిల్ 7న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ చిత్తూరు కోర్టులో పేలుడు సృష్టించినట్లు నిర్దారణకు వచ్చారు. ఏడాది తరువాత 2016 ఏప్రిల్ 7న చిత్తూరు కోర్టులో బాంబు పేలడమే ఇందుకు నిదర్శనం. ఇది తమ పనేననంటూ ‘బేస్ మూవ్మెంట్’ పేరిట చిత్తూరులోని వాణిజ్య పన్నులశాఖ డిప్యూటీ కమిషనరుకు లేఖ రావడం, దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు పుత్తూరులో ఆల్-ఉమా తీవ్రవాదులను పట్టుకున్నారు. ఈ పేలుడు వారి పనే అయి ఉంటుందని అనుమానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సిద్దికి అనే వ్యక్తి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. ఎవరీ సిద్దికి.. ముస్లింల అణిచివేతను నిరసిస్తూ 20 ఏళ్ల క్రితం తమిళనాడుకు చెందిన సిద్దికి అనే వ్యక్తి ఆల్-ఉమా అనే సంస్థను ఏర్పాటు చేసినట్లు పోలీసుల రికార్డుల్లో ఉంది. అప్పట్లో తమిళనాడు పోలీసులు ఇతన్ని అరెస్టు చేసినా తప్పించుకున్నాడు. దాని తరువాత 1998లో ఎల్కే అద్వానీ లక్ష్యంగా కోయంబత్తూరులో పేలుడు జరగడం, 58 మంది మృతి చెందడంతో సిద్దికి పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. అనంతరం ఇతను కనుమగైపోయాడు. ఎక్కడున్నాడు ? ఏమయ్యాడనే వివరాలు లేవు. కానీ పోలీసు రికార్డుల్లో మాత్రం సిద్దికి పరారీలో ఉన్నట్లు నమోదయ్యింది. 2013 అక్టోబర్‌లో పుత్తూరులో జరిగిన ఆపరేషన్‌లో ఆల్-ఉమాకు సంబంధించిన బిలాల్ మాలిక్, పన్నా ఇస్మాయిల్, ఫక్రుద్దీన్లను అరెస్టు చేశారు. తమిళనాడులో జరిగిన బీజేపీ, శివసేన కార్యకర్తల హత్య కేసుల్లో సైతం వీళ్లు నిందితులు. చెన్నై నుంచి వీళ్లను చిత్తూరు జిల్లాలోని కోర్టుల్లో వాయిదాలకు హాజరు పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరులో జరిగిన పేలుళ్లు ఆల్-ఉమా, బేస్ మూవ్మెంట్ సంస్థల పనేనని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో సిద్దికి హస్తం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. జైళ్లకు లేఖలు.. కోయంబత్తూరు పేలుళ్లు, బీజేపీ నేతల హత్యల్లో నిందితులుగా ఉన్న వీరు ప్రస్తుతం తమిళనాడులోకి పలు జైళ్లల్లో ఉన్నారు. వీళ్లకు మద్దతుగా గత ఆర్నెళ్లుగా ఆయా జైళ్లశాఖలకు ఇంగ్లీషులో టైప్ చేసిన లేఖలు పోస్టుల ద్వారా వస్తున్నాయి. ముస్లింలపై నిర్బంధం, అణిచివేతకు ప్రతీకారం తప్పదని ఆ లేఖల సారాంశం. చిత్తూరు కోర్టులో బాంబు పెట్టింది కూడా తామేనంటూ, మరికొన్ని దాడులు చేస్తామంటూ వాణిజ్య పన్నులశాఖకు లేఖ వచ్చింది. ఈ నేపథ్యంలో తమిళనాడు జైళ్లకు వచ్చిన లేఖలను పరిశీలించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఏటీఎఫ్ తదితర సంస్థలు రాష్ట్ర హోంశాఖ నుంచి చిత్తూరు ఘటన వివరాలు సేకరిస్తున్నాయని తెలిసింది. -
వాడివేడిగా అసెంబ్లీ
- వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై చర్చకు ఎంఐఎం పట్టు - రైతు సమస్యలకే పరిమితమవుదాం: సీఎం సూచన - ఎజెండాలో రైతు ఆత్మహత్యలు అన్న పదం లేకపోవడంపై జానా అభ్యంతరం - సమస్యపై చర్చల్లో ఏదైనా మాట్లాడొచ్చు: అధికారపక్షం సాక్షి, హైదరాబాద్: రెండోరోజు శాసనసభా సమావేశాలు వాడివేడిగా ఆరంభమయ్యాయి. మంగళవారం సమావేశం ఆరంభం కాగానే స్పీకర్ మధుసూదనాచారి రాష్ట్రంలో కరువు పరిస్థితులు, రైతుల అంశంపై చర్చను ఆరంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ లేచి, తాము వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై వాయిదా తీర్మానం ఇచ్చామని, దీనిపై చర్చ జరపాలని కోరారు. 23న జరిగిన బీఏసీ సమావేశంలో ప్రశ్నోత్తరాలను రద్దుచేస్తామని చెప్పారే తప్ప, రైతుల ఆత్మహత్యలపై చర్చిస్తామనలేదన్నారు. ఇప్పుడు ప్రశ్నోత్తరాలను రద్దు చేసినందున వికార్ ఎన్‌కౌంటర్‌పై చర్చిద్దామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జోక్యం చేసుకుంటూ ‘ఈ రోజు ఇతర అంశాలను చర్చ చేయలేం. కేవలం రైతు సమస్యలపై మాత్రమే చర్చిద్దామని చెప్పాం. రెండ్రోజులు దానిపైనే చర్చిద్దాం’ అన్నారు. సీఎం ప్రకటనపైనా అక్బరుద్దీన్ అభ్యంతరం చెప్పడంతో మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకొని ప్రభుత్వ పక్షాన సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా అక్బరుద్దీన్ పట్టువీడక పోవడంతో కేసీఆర్ మరోమారు కల్పించుకొని ‘ వికార్ ఎన్‌కౌంటర్‌పై తర్వాత రోజున చర్చిద్దాం.. ప్రస్తుతానికి కూర్చోండి’ అని కోరడంతో అక్బర్ శాంతించారు. అనంతరం ప్రతిపక్షనేత కె.జానారెడ్డి లేచి ఎజెండాలో కేవలం రైతుసంక్షేమం అంశాన్నే చేర్చారని, ఆత్మహత్యలు, రుణమాఫీ,కరువు పరిస్థితులను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. దీనిపై మళ్లీ హరీశ్ స్పందిస్తూ, ‘గతంలోనూ నేరుగా రైతుల ఆత్మహత్యల అంశాన్ని ఎజెండాలో ఎక్కడా చేర్చలేదని చెప్పుకొచ్చారు. రైతు ప్రాధాన్యత దృష్ట్యా మొదటిరోజే చర్చకు పెట్టామని, దీనిపై మాట్లాడితే ఆత్మహత్యల పాపమంతా కాంగ్రెస్‌దే అని తేలుతుంది’ అని అన్నారు. శాశ్వత పరిష్కారాలు వెతుకుదాం: సీఎం పరస్పర నిందారోపణ కాకుండా సమస్యను లోతుగా చర్చించి శాశ్వతపరిష్కారాలు వెతుకుదామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతు సమస్యలపై చర్చలో ఎవరైనా ఏ అంశంపైనయినా స్వేచ్ఛగా మాట్లాడవచ్చని సూచించారు. -
ఆలేరు పోలీస్ స్టేషన్లో సిట్ విచారణ
ఆలేరు (నల్లగొండ) : వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం ఏర్పాటైన సిట్ బృందం బుధవారం నల్లగొండ జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించింది. అక్కడి సిబ్బంది నుంచి వివరాలు సేకరించింది. ఉదయం 7 గంటలకు వచ్చిన ఐదుగురు సభ్యుల విచారణ బృందం మధ్యాహ్నం 2.30 గంటల వరకు అక్కడే ఉంది. వికారుద్దీన్‌తోపాటు మరో నలుగురు ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసిన బస్సును ఆలేరు స్టేషన్లోనే ఉంచారు. ఆ బస్సును విచారణ అధికారులు పరిశీలించారు. గత నెల 7న వికారుద్దీన్, మరో నలుగురు ఉగ్రవాదులను విచారణ కోసం వరంగల్ కేంద్ర కారాగారం నుంచి హైదరాబాద్ కోర్టుకు తీసుకువస్తుండగా... ఆలేరు సమీపంలోకి రాగానే వారు తప్పించుకునేందుకు యత్నించగా పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దీనిపై ఆరోపణలు రావడంతో సీఎం కేసీఆర్ స్వయంగా సిట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సిట్ బృందంలో సందీప్‌శాండిల్య (ఐజీ), రవికుమార్(ఐజీ), షానవాజ్ ఖాసిం (ఖమ్మం ఎస్పీ), రవీందర్ (హుమాయూన్ నగర్ సీఐ)తోపాటు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన రాధా వెంకట్‌రెడ్డి ఉన్నారు. వీరి వెంట భువనగిరి డీఎస్పీ మోహన్‌రెడ్డి కూడా ఆలేరు స్టేషన్‌కు వచ్చారు. -
వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై ఆర్డీవో విచారణ
నల్లగొండ: గత నెల 7న నల్లగొండ జిల్లా ఆలేరులోని కందిగడ్డతండా శివారులో తీవ్రవాది వికారుద్దీన్, అతని అనుచరుల ఎన్‌కౌంటర్‌పై గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నల్లగొండ ఆర్డీవో వెంకటాచారి విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి 22 మందికి నోటీసులు జారీ చేయగా గురువారం విచారణకు 8 మంది హాజరయ్యారు. హాజరైన వారిలో నలుగురు వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. కాగా, మిగతా నలుగురు పోలీసు సిబ్బంది. ఆర్డీవో వెంకటాచారి వారి నుంచి వాంగ్ములాలను తీసుకున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆలేరుకు చేరుకున్న ఆర్డీవో సాయంత్రం 5 గంటల వరకు తహశీల్దార్ కార్యాలయంలోనే ఉన్నారు. శుక్రవారం కూడా విచారణ కొనసాగుతుందని ఆయన తెలిపారు. (ఆలేరు) -
'వికార్ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణ జరిపించాలి'
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్‌సిటీ) : జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న వికారుద్దీన్ అతని అనుచరుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యుమన్ రైట్స్ అర్గనైజేషన్ (ఎన్సీహెచ్ఆర్వో) ప్రతినిధులు ప్రొఫెసర్ ఎ.మార్క్స్, రేణి, సుగుమారన్, మహ్మద్ యూసూప్లు పేర్కొన్నారు. తమ ఎన్సీహెచ్ఆర్వో ఆధ్వర్యంలో ఈ నెల 28, 29 తేదీలలో వికార్గ్యాంగ్పై ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సందర్శించామని, దానిని నిజనిర్ధారణ కమిటీగా తాము వివరాలు సేకరించామని తెలిపారు. ఆలేరు పీఎస్ పరిధిలో ఈ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పారు. తెలంగాణ పోలీసులు పక్కా ప్రణాళికతో 5 మంది అండర్ ట్రైయిల్ ఖైదీలను హత్యచేసిందని వారు ఆరోపించారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. 30 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. వికార్గ్యాంగ్ను ఎన్కౌంటర్ చేసేముందే పోలీసులు ట్రాఫిక్‌ను మరలించాలని తమ విచారణలో వెల్లడైందన్నారు. ఈ బూటకపు ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై హత్యానేరం కింద కేసులు పెట్టి వారిని శిక్షించాలని వారు కోరారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు ప్రత్మేశ్, మహ్మద్ అబ్దుల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
సిట్ ఏర్పాటు కంటితుడుపు చర్య: షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై సిట్‌తో విచారణ జరిపించాలని తీసుకున్న నిర్ణయం కంటితుడుపు చర్యేనని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. ఈ ఎన్కౌంటర్ బూటకమేనని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని సోమవారం డిమాండ్ చేశారు. మైనార్టీలతో స్నేహపూర్వకంగా ఉంటామంటున్న సీఎం దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ప్రభుత్వం, పోలీసులు ఇష్టారాజ్యంగా చంపేయడం, అక్రమ కేసులు పెట్టడం మంచిది కాదని హితవు పలికారు. -
దోస్తీ కటీఫ్..?
-
'అలాంటి ఫీట్లు రజనీకాంత్ సినిమాలోనే సాధ్యం'
-
కేసీఆర్‌తో అసదుద్దీన్, ముస్లిం మతపెద్దల భేటీ
-
'అలాంటి ఫీట్లు రజనీకాంత్ సినిమాలోనే సాధ్యం'
''చేతులకు సంకెళ్లు ఉండగా ఎవరైనా తుపాకి వాడగలరా.. అలాంటి ఫీట్లు కేవలం రజనీకాంత్ సినిమాల్లోమాత్రమే సాధ్యమవుతాయి'' ఈ మాటలన్నది ఎవరో కాదు. ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. వికారుద్దీన్ ఎన్కౌంటర్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసి నిరసన తెలిపేందుకు ఆయన కొందరు ముస్లిం మతపెద్దలతో కలిసి గురువారం నాడు సచివాలయానికి వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం బయటకొచ్చి మీడియాతో మాట్లాడారు. వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ లేదా హైకోర్టు సిటింగ్ జడ్డిజతో విచారణ కోరినట్లు అసదుద్దీన్ తెలిపారు. జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి వద్ద నిరసన తెలిపామని, సీఎం కూడా విచారం వ్యక్తం చేశారని ఆయన అన్నారు. తనకు మూడు రోజుల సమయం ఇస్తే సంఘటన వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు కూడా అసద్ వివరించారు. -
కేసీఆర్‌తో అసదుద్దీన్, ముస్లిం మతపెద్దల భేటీ
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ముస్లిం మతపెద్దలు గురువారం భేటీ అయ్యారు. వరంగల్ శివారులో జరిగిన ఎన్కౌంటర్లో వికారుద్దీన్ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను అసదుద్దీన్ ఒవైసీ కోరుతున్నట్టు తెలిసింది. వికారుద్దీన్ ఎన్కౌంటర్ విషయంలో ఒవైసీలు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లాలో పోలీసుల మీద జరిగిన కాల్పులకు ప్రతీకారంగానే వికారుద్దీన్‌ను బూటకపు ఎన్కౌంటర్లో హతమార్చారని కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఇతర ముస్లిం మతపెద్దలతో కలిసి కేసీఆర్ వద్దకు వెళ్లడం, ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. -
కుట్రపన్ని కాల్చి చంపారు: సీపీఎం
న్యూఢిల్లీ: తెలంగాణలో జరిగిన ఐదుగురు అండర్ ట్రయల్ ఖైదీల ఎన్కౌంటర్ బూటకమని సీపీఎం పేర్కొంది. పోలీసులు ముందుగానే కుట్ర పన్ని వారిని కాల్చిచంపారని చేశారని ఆరోపించింది. ఈ ఘటనను సిగ్గుమాలిన చర్యగా వర్ణించింది. సిమి తీవ్రవాదులు ఇద్దరు పోలీసులను కాల్చిచంపినందుకు ప్రతీకారంగా ఈ ఎన్కౌంటర్ చేశారని ఆరోపించింది. చేసిన తప్పును కప్పిపుచ్చుకోలేరని పేర్కొంది. ఈ కాల్పుల ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని, బాధ్యులైన పోలీసుల నుంచి వివరణ తీసుకోవాలని డిమాండ్ చేసింది. తీవ్రవాది వికారుద్దీన్ సహా ఐదుగురు ఖైదీలను నల్లగొండ జిల్లాలో పోలీసులు మంగళవారం ఎన్కౌంటర్ చేశారు.