'అలాంటి ఫీట్లు రజనీకాంత్ సినిమాలోనే సాధ్యం' | asaduddin owaisi meets cm kcr over vikaruddin encounter | Sakshi
Sakshi News home page

'అలాంటి ఫీట్లు రజనీకాంత్ సినిమాలోనే సాధ్యం'

Published Thu, Apr 9 2015 4:25 PM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

'అలాంటి ఫీట్లు రజనీకాంత్ సినిమాలోనే సాధ్యం' - Sakshi

'అలాంటి ఫీట్లు రజనీకాంత్ సినిమాలోనే సాధ్యం'

''చేతులకు సంకెళ్లు ఉండగా ఎవరైనా తుపాకి వాడగలరా.. అలాంటి ఫీట్లు కేవలం రజనీకాంత్ సినిమాల్లోమాత్రమే సాధ్యమవుతాయి'' ఈ మాటలన్నది ఎవరో కాదు. ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. వికారుద్దీన్ ఎన్కౌంటర్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసి నిరసన తెలిపేందుకు ఆయన కొందరు ముస్లిం మతపెద్దలతో కలిసి గురువారం నాడు సచివాలయానికి వెళ్లారు.

అక్కడ ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం బయటకొచ్చి మీడియాతో మాట్లాడారు. వికారుద్దీన్ ఎన్కౌంటర్పై సీబీఐ లేదా హైకోర్టు సిటింగ్ జడ్డిజతో విచారణ కోరినట్లు అసదుద్దీన్ తెలిపారు. జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి వద్ద నిరసన తెలిపామని, సీఎం కూడా విచారం వ్యక్తం చేశారని ఆయన అన్నారు. తనకు మూడు రోజుల సమయం ఇస్తే సంఘటన వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు కూడా అసద్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement