హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్తో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ముస్లిం మతపెద్దలు గురువారం భేటీ అయ్యారు. వరంగల్ శివారులో జరిగిన ఎన్కౌంటర్లో వికారుద్దీన్ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్పై విచారణ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ను అసదుద్దీన్ ఒవైసీ కోరుతున్నట్టు తెలిసింది. వికారుద్దీన్ ఎన్కౌంటర్ విషయంలో ఒవైసీలు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.
నల్లగొండ జిల్లాలో పోలీసుల మీద జరిగిన కాల్పులకు ప్రతీకారంగానే వికారుద్దీన్ను బూటకపు ఎన్కౌంటర్లో హతమార్చారని కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఇతర ముస్లిం మతపెద్దలతో కలిసి కేసీఆర్ వద్దకు వెళ్లడం, ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
కేసీఆర్తో అసదుద్దీన్, ముస్లిం మతపెద్దల భేటీ
Published Thu, Apr 9 2015 3:34 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement