
సిట్ ఏర్పాటు కంటితుడుపు చర్య: షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై సిట్‌తో విచారణ జరిపించాలని తీసుకున్న నిర్ణయం కంటితుడుపు చర్యేనని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. ఈ ఎన్‌కౌంటర్ బూటకమేనని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని సోమవారం డిమాండ్ చేశారు. మైనార్టీలతో స్నేహపూర్వకంగా ఉంటామంటున్న సీఎం దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ప్రభుత్వం, పోలీసులు ఇష్టారాజ్యంగా చంపేయడం, అక్రమ కేసులు పెట్టడం మంచిది కాదని హితవు పలికారు.