తడ: నెల్లూరు జిల్లా తడ పోలీస్ స్టేషన్ నుంచి విచారణలో ఉన్న ఇద్దరు దొంగలు పరారయ్యారు. వివరాలు.. పోలీసులు ఓ లారీ దొంగతనం కేసులో తమిళనాడులోని వేలూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకుని విచారణలో ఉంచారు. వారిని బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు కలసి వెళ్లారు. అనంతరం ఇద్దరు దొంగలను స్టేషన్‌లోని ఓ గదిలో ఉంచగా, పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు.