కడప అర్బన్ : కడపలోని ఓ ప్రధాన పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కేసు విషయమై అత్యుత్సాహం చూపి బాధితులకు న్యాయం చేయలేదని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణకు ఫిర్యాదు చేసినట్లు శ్రీవిజయసేవా సమితి కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నెహ్రూ యువ కేంద్రంలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న మస్తానయ్య స్థలాలు ఇప్పిస్తామని కొంత మంది వద్ద నుంచి రూ. 1,60,000 వసూలు చేశాడని, బాధితుల తరపున అడిగితే కట్టుకథ అల్లి, తప్పుడు కేసు పెట్టారన్నారు. కనీస విచారణ చేయకుండా కేసు నమోదు చేశారన్నారు. స్థలాల పేరుతో డబ్బులు వసూలు చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. స్పందించిన ఎస్పీ విచారణ చేసి న్యాయం చేస్తామనీ తెలిపినట్లు ఆయన వివరించారు.