
పెదవి విప్పని సల్మాన్.. కంట తడి
హిట్ అండ్ రన్ కేసులో తీర్పు సందర్భంగా సల్మాన్ ఖాన్ పెదవి విప్పలేదు. ముంబై సెషన్స్ జడ్జి దేశ్పాండే తీర్పు చదువుతున్నప్పుడు అతడు మౌనంగా నిలబడి ఉన్నాడు.
ముంబయి : హిట్ అండ్ రన్ కేసులో తీర్పు సందర్భంగా సల్మాన్ ఖాన్ పెదవి విప్పలేదు. ముంబై సెషన్స్ జడ్జి దేశ్పాండే తీర్పు చదువుతున్నప్పుడు అతడు మౌనంగా నిలబడి ఉన్నాడు. తీర్పు వింటున్నప్పుడు సన్నటి కన్నీటి ధార అతడి కళ్లలో కనపించింది. మరోవైపు కోర్టు సల్మాన్ను దోషిగా నిర్థారిస్తూ తీర్పు వెలువరించిన వెంటనే సల్మాన్ సోదరులు ఆర్భాజ్ ఖాన్, సోహైల్ ఖాన్లు కోర్టు నుంచి వెళ్లిపోయారు. కోర్టు నుంచి బయటకు వస్తూ సోదరులు కంటతడి పెట్టారు. మరోవైపు సల్మాన్ తల్లి కూడా తీర్పు వెలువడిన వెంటనే కన్నీటిపర్యంతం అయ్యారు.
ఇక కోర్టు నుంచి బయటకు వచ్చిన సల్మాన్ సోదరులను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. మాట్లాడాలని కోరినా... వారు మాత్రం వేదనతో అక్కడ నుంచి వెళ్లిపోయారు.