
బాధకరమే, హైకోర్టు ఉందిగా: చిరంజీవి
అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదానికి, ఉద్దేశ పూర్వకంగా చేసిన దానికి తేడా చూడాలని ప్రముఖ టాలీవుడ్ నటుడు, రాజ్యసభ ఎంపీ చిరంజీవి అన్నారు.
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కేసు తీర్పుపై సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి స్పందించారు. అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదానికి, ఉద్దేశ పూర్వకంగా చేసిన దానికి తేడా చూడాలని ఆయన బుధవారమిక్కడ అన్నారు. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ దోషే అని కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో దీనిపై ఆయన పైవిధంగా స్పందించారు.
తన సహచరుడు సల్మాన్కు ఇలాంటి పరిస్థితి రావడం బాధగా ఉందని, అయితే, ఆయన హైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నందున కొంత మేలు జరుగుతుందనే ఆశ ఉందని అన్నారు. సల్మాన్ ఒప్పుకున్న సినిమాలకు ఎలాంటి నష్టం జరగదని, అవకాశాలను బట్టి అవి కూడా చిత్రీకరణ పూర్తి చేసుకుంటాయని చిరంజీవి పేర్కొన్నారు.