
కోర్టు నుంచి ఇంటికి సల్మాన్
హిట్ అండ్ రన్ కేసులో జైలు శిక్ష పడిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో సెషన్స్ కోర్టు నుంచి తన నివాసానికి బయలు దేరారు.
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో జైలు శిక్ష పడిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో సెషన్స్ కోర్టు నుంచి తన నివాసానికి బయలు దేరారు. బాంబే హైకోర్టు ఈనెల 2 రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయనను జైల్లో పెట్టలేదు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను బాంబే హైకోర్టు శుక్రవారం విచారించనుంది.
సెషన్స్ కోర్టు వెలువరించిన తీర్పు పూర్తి పాఠం అందనందున మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని సల్మాన తరపు న్యాయవాది హరీష్ సాల్వే కోరడంతో హైకోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. దీంతో సల్మాన్ ఖాన్ రెండు రోజుల పాటు ఊరట లభించింది. 2002 హిట్ అండ్ రన్ కేసులో సెషన్స్ కోర్టు... సల్మాన్ కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.