
'మద్యం తాగి కారు నడిపింది నువ్వే'
ఎట్టకేలకు 2002లో జరిగిన 'హిట్ అండ్ రన్' కేసులో బుధవారం తుదితీర్పు వెలువడింది. సల్మాన్ ఖాన్ దోషి అంటూ ముంబై సెషన్స్ కోర్టు నిర్థారించింది
ముంబయి: ఎట్టకేలకు 2002లో జరిగిన 'హిట్ అండ్ రన్' కేసులో బుధవారం తుదితీర్పు వెలువడింది. సల్మాన్ ఖాన్ దోషి అంటూ ముంబై సెషన్స్ కోర్టు నిర్థారించింది. న్యాయమూర్తి డీడబ్ల్యూ దేశ్‌పాండే ఈ మేరకు తీర్పును వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది నువ్వే అంటూ జడ్జి ఈ సందర్భంగా సల్మాన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'కారును నడుపుతున్నప్పుడు నువ్వు మద్యం తాగి ఉన్నావు.
కారు నడిపింది డ్రైవర్ అంటూ కోర్టు ముందు తప్పుడు సాక్ష్యం ఉంచావు. నీ ప్రోద్భలంతో డ్రైవర్ కూడా కోర్టు ముందు తప్పుడు సాక్ష్యం ఇచ్చాడు' అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా చేసింది కాకపోయినా, ఒకరు చనిపోవడానికి సల్మాన్ కారకుడని జడ్జి వ్యాఖ్యానించారు. కాగా శిక్షించదగిన హత్యానేరం కింద అతడిని ముంబై సెషన్స్ కోర్టు నిర్థారించింది. అతనిపై మోపిన అన్ని అభియోగాలు సరైనవేనని పేర్కొంది.