హిట్‌ అండ్‌ రన్‌ కేసు: ఇద్దరు మృతి | 2 teenaged boys die in hit-and-run accident | Sakshi
Sakshi News home page

హిట్‌ అండ్‌ రన్‌ కేసు: ఇద్దరు మృతి

Published Sun, May 1 2016 4:06 PM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM

2 teenaged boys die in hit-and-run accident

తిరునెల్వలి: హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన తమిళనాడులో నాగనూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో తిరునెల్వలి ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులను ఎదురుగా వస్తున్న ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

విజయనారాయణ గ్రామం నుంచి బైక్‌పై తిరిగివస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఎస్‌. పరమశివన్‌ (18), సుదలిముత్తు (17) అనే ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement