చైనాలో విషాదకర సంఘటన జరిగింది. హిట్ అండ్ రన్ కేసులో ఓ వ్యక్తి తల్లి ప్రాణాలు తీశాడు.
బీజింగ్: చైనాలో విషాదకర సంఘటన జరిగింది. హిట్ అండ్ రన్ కేసులో ఓ వ్యక్తి తల్లి ప్రాణాలు తీశాడు. తాను చేసిన యాక్సిడెంట్లో చనిపోయింది తల్లేనని ఆలస్యంగా తెలుసుకున్న నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.
చైనాలో హుబీ ప్రావిన్స్లో ఓ వ్యక్తి తన కొడుకుతో కలసి మోటార్ సైకిల్పై అతివేగంగా వెళ్తూ ఇద్దరు మహిళలను ఢీకొట్టాడు. వారికి సాయం చేద్దామని కొడుకు చెప్పినా వినకుండా ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయడిపన ఇద్దరు మహిళల్లో ఒకరు ప్రమాద స్థలంలో మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చనిపోయారు. అనంతరం నిందితుడికి అసలు విషయం తెలిసింది. హిట్ అండ్ రన్ లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు మహిళల్లో తన తల్లి కూడా ఉందని తెలుసుకున్నాడు. మరుసటి రోజు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.