న్యూఢిల్లీ: వలసపాలన నాటి నేర న్యాయ వ్యవస్థ చట్టాలను సంస్కరించి నేటి ఆధునిక సమాజ అవసరాలకు తగ్గట్లుగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా చట్టాలు జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించిన నిబంధనలు మాత్రం ఇప్పుడే అమలుకావు.
హిట్ అండ్ రన్ కేసులపై ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్తంగా కొద్దివారాల క్రితం ధర్నాకు దిగిన నేపథ్యంలో ఈ నిబంధనల అమలును ప్రస్తుతానికి పక్కనబెట్టారు. ఈ మూడు నూతన చట్టాలకు గత ఏడాది డిసెంబర్ 21న పార్లమెంట్ ఆమోదం తెలపగా డిసెంబర్ 25వ తేదీన రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసిజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్1872ల స్థానంలో ఈ మూడు చట్టాలు తెచి్చన సంగతి తెల్సిందే.
దోషులను శిక్షించడంకంటే ముందు బాధితులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతోనే ఈ చట్టాలను తెచ్చామని బిల్లులపై చర్చ సందర్భంగా పార్లమెంట్‌లో హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు. ఐపీసీలో లేని ఉగ్రవాదం అనే దానికి తొలిసారిగా కొత్త చట్టంలో సరైన నిర్వచనం పొందుపరిచారు. రాజదోహ్రం అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ‘దేశ వ్యతిరేక నేరాలు’ అనే సెక్షన్‌ను జతచేశారు.
వేర్పాటువాదం, సాయుధపోరాటాలు, దేశ సార్వ¿ౌమత్వాన్ని భంగపరిచే చర్చలు, దేశ, విదేశాల్లో ఉంటూ చేసే విధ్వంసకర కుట్రలు, దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే కుట్ర విద్వేష ప్రసంగాలు.. ఇలా పలు రకాల నేరాలను ఇకపై దేశవ్యతిరేక నేరాలుగా పరిగణిస్తారు. ఈ నేరాలకు గరిష్టంగా జీవితఖైదు పడొచ్చు. రాజద్రోహం అనే పదాన్ని తొలగించి దేశద్రోహం అనే నిర్వచించారు. దోషులకు మేజిస్ట్రేట్ విధించే జరిమానా మొత్తాలను పెంచారు. అన్ని భాగస్వామ్య వర్గాల సలహాలు, సూచనలు స్వీకరించి సమగ్ర చర్చలు, సంప్రతింపుల తర్వాతే ముసాయిదా బిల్లులు చట్టాలుగా రూపుదాల్చాయని అమిత్ షా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment