
సాక్షి, శంషాబాద్ : తాగిన మైకంలో కొందరు వ్యక్తులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో వీరంగం సృష్టించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి తప్పించుకునే యత్నంలో ట్రాఫిక్ పోలీసులను కారుతో ఢీకొట్టి మందుబాబులు పరారయ్యేందుకు యత్నించారు. అయితే 2 కిలోమీటర్ల మేర వెంబడించి నిందితులను పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌కు నిందితులను తరలించారు.
అయితే కారును ఆపే క్రమంలో ఎస్‌ఐకి స్వల్పగాయాలయ్యాయి. ఎస్‌ఐ, కానిస్టేబుల్ కారును అపేందుకు యత్నించగా, మందుబాబులు ఎస్‌ఐని, వారి వాహనాన్ని.. పోలీసుల నుంచి తప్పించుకునే యత్నంలో మరో బైకును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment