సల్మాన్ శిక్షపై సెలబ్రిటీల స్పందన | Bollywood stands by convicted Salman Khan | Sakshi
Sakshi News home page

సల్మాన్ శిక్షపై సెలబ్రిటీల స్పందన

Published Wed, May 6 2015 2:10 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సల్మాన్ శిక్షపై సెలబ్రిటీల స్పందన - Sakshi

సల్మాన్ శిక్షపై సెలబ్రిటీల స్పందన

ముంబై: హిట్ అండ్ రన్ కేసులో కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష పడడంపై బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సల్మాన్ కు బాసటగా సోషల్ మీడియా కామెంట్ పోస్ట్ చేశారు. కోర్టు తీర్పుపై వ్యాఖ్యానించబోనని రితేష్ దేశ్ ముఖ్ పేర్కొన్నారు. బాలీవుడ్ లో దయర్ద్ర హృదయుల్లో సల్మాన్ ఒకరని, తన మనసంతా అతడితోనే ఉందని ట్విటర్ లో పోస్ట్ చేశారు.

తన తల్లి ప్రాణాలు కాపాడిన మంచి మనిషి సల్మాన్ అని, అతడు చేసిన సహాయాన్ని ఎన్నడూ మరిచిపోనని నటి దియా మిర్జా పేర్కొన్నారు. సల్మాన్ శిక్ష విధించారన్న వార్త దిగ్భ్రాంతి కలిగించిందని నటి సోనాక్షి సిన్హా  వ్యాఖ్యానించింది. ఏం మాట్లాడాలో తెలియడం లేదని పేర్కొంది. సల్మాన్ మంచి మనిషి అని దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సల్మాన్ కు జైలుశిక్ష విధించారన్న వార్తతో తన గుండె ఆగినంద పనైందని కునాల్ కోహ్లి వాపోయాడు. సల్మాన్ ఖాన్ దోషి అని ఎవరు లేదా ఏ న్యాయస్థానం చెప్పినా తాను అతనికే సపోర్ట్ చేస్తానని అర్జున్ కపూర్ ట్వీట్ చేశాడు.

మన వాళ్లేవరైనా తప్పుచేసినా శిక్ష పడితే బాధపడతాం... సల్మాన్ ఖాన్ అంటే తమకు ఇష్టమని, తామంతా ఆయన వెంటే ఉంటామని అలియా భట్ పేర్కొంది. సల్లూ భాయ్ కోసం ప్రార్థనలు చేశానని వాజిద్ ఖాన్ తెలిపారు. ఎంతో మందికి ఉపాధి కల్పించిన సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల శిక్ష ఎక్కువని ఫరా ఖాన్ అలీ పేర్కొన్నారు. అతడికి విధించిన శిక్షకు తగ్గిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement