
'ఆ సమయంలో సల్మాన్ మద్యం సేవించారు'
హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బుధవారం ముంబై సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు.
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బుధవారం ముంబై సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. 2002లో ఘటన జరిగిన సమయంలో సల్మాన్ నుంచి సేకరించిన బ్లడ్ శాంపుల్స్ పరీక్షల నివేదకను నిపుణులు కోర్టుకు సమర్పించారు.
ఆల్కాహాల్ టెస్టు పాజిటీవ్గా వచ్చినట్టు కోర్టుకు నివేదించారు. ఆ సమయంలో సల్మాన్ పరిమితికి మించి ఆల్కాహాల్ సేవించినట్టు నిపుణులు కోర్టుకు వెల్లడించారు. 2002లో సల్మాన్ మద్యం మత్తులో కారు నడుపుతూ.. ముంబైలోని బాంద్రాలో ఫుట్పాత్ నిద్రిస్తున్న వారిపై తోలినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు.