సల్మాన్ బెయిల్ రద్దు చేయండి | BJP seeks cancellation of Salman's bail over Yakub tweets | Sakshi
Sakshi News home page

సల్మాన్ బెయిల్ రద్దు చేయండి

Published Sun, Jul 26 2015 5:02 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

సల్మాన్ బెయిల్ రద్దు చేయండి - Sakshi

సల్మాన్ బెయిల్ రద్దు చేయండి

ముంబై: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ ఉరిశిక్షకు వ్యతిరేకంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్లపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే హిట్ అండ్ రన్ కేసులో ఆయన బెయిల్ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకొని సల్మాన్ బెయిల్ను రద్దు చేసేలా చూడాలంటూ ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావుకు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆశిష్ మీడియాతో మాట్లాడుతూ ఓ దోషికి సల్మాన్ మద్దతు తెలపడం తనను తీవ్రంగా బాధపెట్టిందని, ఒక నేరానికి మద్దతు తెలిపిన ఆయన బెయిల్ రద్దు చేయాలని గవర్నర్కు లేఖ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. యాకూబ్ మెమన్ పెద్ద సంఖ్యలో మారణ హోమానికి పాల్పడ్డారని చెప్పారు. ఇదిలా ఉండగా, సల్మాన్ నివాసం ముందు బీజేపీ యువజన విభాగం బీజేపీ యువ మోర్చా ఆందోళన నిర్వహిస్తోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement