సల్మాన్ భవిష్యత్తేమిటో... ఈ వారమే తేలనుంది! | Salman Khan hit and run case: Bombay High Court to deliver verdict on actor's appeal this week | Sakshi
Sakshi News home page

సల్మాన్ భవిష్యత్తేమిటో... ఈ వారమే తేలనుంది!

Published Mon, Dec 7 2015 8:59 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సల్మాన్ భవిష్యత్తేమిటో... ఈ వారమే తేలనుంది! - Sakshi

సల్మాన్ భవిష్యత్తేమిటో... ఈ వారమే తేలనుంది!

ముంబై: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ భవిషత్తేమిటో ఈ వారం తేలనుంది. 2002నాటి ఈ కేసులో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ శిక్షను సవాలు చేస్తూ ఆయన దాఖలుచేసిన అప్పీలుపై బొంబాయి హైకోర్టు ఈ వారంలోనే తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో వాదనలు ఆదివారంతో ముగిశాయి. సోమవారం నుంచి తీర్పు డిక్టేషన్ ను ప్రారంభిస్తానని న్యాయమూర్తి ఏఆర్ జోషీ తెలిపారు. 2002లో తాగి వాహనం నడిపి పేవ్ మెంట్ మీద పడుకున్న ఓ వ్యక్తిని ఢీకొని.. అతని మరణానికి కారణమైనట్టు సల్మాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో 49 ఏళ్ల సల్మాన్ కు సెషన్ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. ఐపీసీ ప్రకారం అతనిపై పలు అభియోగాలు రుజువైనట్టు కింది కోర్టు పేర్కొంది.

ఈ తీర్పుపై సల్మాన్ బొంబాయి హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం వాదనలు వినడానికి ముందే ఆయనకు బెయిల్ మంజూరుచేసింది. 2002 సెప్టెంబర్ 28న 'రాణి బార్ అండ్ రెస్టారెంట్'లో మద్యాన్ని సేవించిన సల్మాన్ టయోటా లెక్సెస్ కారును స్వయంగా నడుపుతూ ఓ షాపులోకి దూసుకెళ్లాడని, దీంతో ఒక వ్యక్తి మరణించగా.. నలుగురు గాయపడ్డారని ప్రాసిక్యూషన్ వాదిస్తుండగా.. ఆ సమయంలో కారు నడిపింది సల్మాన్ కాదు ఆయన కుటుంబ డ్రైవర్ అమిత్ దేశాయ్ అని సల్మాన్ తరఫు న్యాయవాది పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement