బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. న్యాయవాదులతో సంప్రదింపుల కోసమే ఢిల్లీకి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం విధానం కేసులో జైలులో ఉన్న ఎమ్మెల్సీ, తన సోదరి కవితకు కూడా కొద్ది వారాల్లో బెయిల్ వస్తుందని ఆశిస్తున్నట్లు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పేర్కొన్నా రు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ లభించిన నేప థ్యంలో ఈ కేసులో ఇతరులకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలున్నాయన్నా రు.
తెలంగాణ భవన్‌లో శుక్రవారం తనను కలిసిన మీడియా ప్రతినిధుల తో కేటీఆర్ మాట్లాడుతూ, ‘రాజకీయంగా కొట్లాడాల్సిన సందర్భంలో ఈ తరహా కేసులు తప్పవని అనుకుంటున్నాం. 11వేల మంది ఉండాల్సిన జైలు లో 30 వేల మంది ఉన్నారు. జైలులో కవిత ఇబ్బందులు పడుతున్నారు. ఆమెతోపాటు మరో ఇద్దరు ఖైదీలు కూడా ఉన్నారు. కవిత 11 కిలోల మేర బరువు కోల్పోయింది. బీపీ వచ్చి రోజుకు రెండు మాత్రలు వేసుకుంటోంది’అని అన్నారు.
న్యాయవాదులతో సంప్రదింపుల కోసమే..: ‘న్యాయవాదులతో సంప్ర దింపుల కోసం ఢిల్లీ వెళితే బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అంటూ బురద చల్లు తున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ ఢిల్లీలో మూడు కేసులపై సుప్రీంకోర్టులో కొట్లాడుతోంది.
అందులో ఒకటి ఎమ్మెల్సీ కవితది కాగా మరొకటి పార్టీ మా రిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించినది. గవ ర్నర్ కోటాలో ఎమ్మెల్సీ లుగా నామినేట్ అయిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్య నారాయణకు సంబంధించిన కేసు కూడా ఉంది’అని కేటీఆర్ అన్నారు. కాగా, 15 రోజులకు ముందు సోదరుడు ఏర్పాటు చేసిన కంపెనీతో ఒప్పందం చేసుకునేందుకు సీఎం రేవంత్ అమెరికాకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన విమర్శించారు.
భూముల కోసం బెదిరిస్తున్నారు
కేటీఆర్‌ను కలసిన కొడంగల్ రైతులు
సాక్షి, హైదరాబాద్: ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి బెదిరింపులకు పాల్ప డుతున్నారని కొడంగల్ నియోజకవర్గ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితోపాటు నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల రైతులు శుక్రవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావును కలసి తాము పడు తున్న ఇబ్బందులను వివరించి అండగా నిలవాలని కోరారు. హకీంపేట్, పోలెపల్లి, లకచర్ల గ్రామంలో మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు పేర్కొన్నారు.
ఫార్మా కంపెనీలతో కాలుష్యం పెరుగుతుందని, తమకు ఈ ఫ్యాకర్టీలు వద్దని రైతులు చెబుతున్నా బెదిరింపులు ఆగడం లేదన్నారు. కోట్లాది రూపా యల విలువ చేసే తమ భూములను అప్పనంగా తమ వద్ద నుంచి లాక్కునేందుకు కుట్రలు జరుగుతున్నా యని తెలిపారు. వ్యవసాయంపై ఆధారపడిన తమకు జీవనాధారమైన భూమిని లాక్కుంటే తమ జీవితాలు సర్వనాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment