బనశంకరి: సంచలనాత్మక రేణుకాస్వామి హత్య కేసులో ఇద్దరు నిందితులకు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ప్రముఖ నటుడు, రెండవ నిందితుడు దర్శన్ బెయిల్ అర్జీ విచారణను 27వ తేదీకి నగర 57వ సీసీహెచ్.కోర్టు వాయిదావేసింది. కానీ 15, 17 నిందితులుగా ఉన్న కార్తీక్, నిఖిల్‌నాయక్‌కు బెయిలు జారీ చేసింది. సాక్షులపై ఒత్తిడి చేయరాదని, పూచీకత్తు ఇవ్వాలని కోర్టు తెలిపింది. పవిత్రాగౌడ బెయిల్ విచారణ 25 కి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment