'నాతో పాటు మరికొంతమంది కాంగ్రెస్లోకి' | many others ready to join Congress, says trs mla aravinda reddy | Sakshi
Sakshi News home page

'నాతో పాటు మరికొంతమంది కాంగ్రెస్లోకి'

Published Fri, Jan 24 2014 9:44 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'నాతో పాటు మరికొంతమంది కాంగ్రెస్లోకి' - Sakshi

'నాతో పాటు మరికొంతమంది కాంగ్రెస్లోకి'

హైదరాబాద్ : ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ నేతలు తమ వ్యూహాలు మార్చుతున్నారు. ఏ పార్టీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్ ఉంటుందో ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుని జంప్ జిలానీలు అవుతున్నారు. ఇక  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందే టీఆర్ఎస్లో కలహం మొదలయ్యింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కారు దిగి.. హస్తాన్ని అంది పుచ్చుకుంటున్నారు.

తాజాగా మంచిర్యాల టీఆర్ఎస్ శాసన సభ్యుడు గడ్డం అరవింద్‌రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. హస్తిన నుంచి తిరిగి వచ్చిన ఆయన తనతో పాటు మరికొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని అనుచ బాంబు పేల్చారు.  టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేయాలని చాలాసార్లు తాను కేసీఆర్కు చెప్పానన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘనత సోనియాగాంధీదేని అరవింద్ రెడ్డి కొనియాడారు.

‘తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీఆర్‌ఎస్ ఆవిర్భవించిన కారణం పూర్తయింది. తెలంగాణ ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీకి కృతజ్ఞత చూపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయకపోయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేయండి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలం అంతా మీ వెంటనే ఉంటాం. ఇంకా గడువును పెంచొద్దు’ అని దిగ్విజయ్ సింగ్‌కు అరవింద్‌రెడ్డి వివరించినట్లు సమాచారం. ఊహించని ఈ భేటీ టీఆర్‌ఎస్‌ను షాక్‌కు గురి చేసిందని, కాంగ్రెస్ వైఖరిపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement