Aravinda Reddy
-
రెండు జంటల ప్రేమకథ
‘‘ప్రేమకథలు ఎన్నిసార్లు చెప్పినా బోర్ కొట్టవు. ట్రెండ్‌కు తగ్గట్టుగా దర్శకులు అప్డేట్ అవుతూ ప్రేమ కథలను నవతరానికి నచ్చేలా రాస్తున్నారు. అలా న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రం ‘నీ కోసం’’ అని నిర్మాత అల్లూరమ్మ (భారతి) అన్నారు. అరవింద్ రెడ్డి, శుభాంగి పంత్, అజిత్ రాధారామ్, దీక్షితా పార్వతి ప్రధాన పాత్రల్లో అవినాష్ కోకటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీ కోసం’. తీర్థసాయి ప్రొడక్షన్స్ పతాకంపై అల్లూరమ్మ (భారతి) నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని ‘తొలితొలిగా...’ పాటను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ‘ఈ పాట చాలా బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలి’ అన్నారాయన. ‘‘రెండు జంటల మధ్య ప్రేమకథను ఈ తరానికి నచ్చేలా తెరకెక్కించిన సినిమా ఇది. ఎంటరై్టన్మెంట్ తగ్గకుండానే ప్రేమకథలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్న ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. లవ్‌స్టోరీలో ఎమోషన్స్‌కు ఎప్పుడూ ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాంటి ఎమోషనల్ అంశాలు మా చిత్రంలో ఉంటాయి. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయనున్నాం’’ అని అవినాష్ కోకటి అన్నారు. సుదర్శన్, ‘ఈ రోజుల్లో’ సాయి, కేధార్ శంకర్, పూర్ణిమ, కల్పలత, మహేష్ విట్టా ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమాకి సంగీతం: శ్రీనివాస్ శర్మ, కెమెరా: శివకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తేజేశ్వరి అన్నపురెడ్డి, సహ నిర్మాతలు: సోమశేఖర్ రెడ్డి, అల్లూరి రెడ్డి. ఏ. -
ప్రేంసాగర్ వర్సెస్ వివేక్.. మధ్యలోఅరవిందరెడ్డి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీ తూర్పు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గ్రూపు విభేదాలకు నిలయమైన ఆ పార్టీలో ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య వర్గపోరు కొనసాగుతుండటం ఎన్నికల వేళ చర్చనీయాంశమైంది. ఈ నేతల మధ్య పోరు ప్రభావం ఆ పార్టీ మరో అభ్యర్థిపై కూడా పడుతోంది. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కేటాయింపుల్లో చక్రం తిప్పిన ప్రేంసాగర్‌రావుకు, ఆ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వివేక్ మధ్య విభేదాలున్నాయి. ఇద్దరు కూడా బలమైన నేతలు కావడంతో ఈ పోరు రసకందాయంలో పడింది. పెద్దపల్లి ఎంపీ లోక్‌సభ స్థానం పరిధిలో వచ్చే మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో ఇరువర్గాల అనుచరులు ఎవరికివారే అన్న చందంగా తయారయ్యారు. ప్రేంసాగర్‌రావు వర్గీయుల సహకారం వివేక్‌కు అందడం లేదు. ముఖ్యంగా బెల్లంపల్లిలో ఈ పరిస్థితి నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వివేక్ ఈ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు.. ప్రేంసాగర్‌రావు వర్గీయులు ఈ ప్రచారానికి దూరంగా ఉన్నారు. సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్‌పై రెబల్‌గా బరిలోకి దిగిన చిలుముల శంకర్ ప్రేంసాగర్‌రావు వర్గీయుడు. ఆయన్ను ప్రేంసాగర్‌రావే బరిలో నిలిపారని సీపీఐ ముఖ్య నాయకులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. కాగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్.మహేందర్‌రావు, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింగరావు, మాజీ చైర్మన్ కారుకూరి రాంచందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్‌కుమార్ తదితరులు ప్రేంసాగర్‌రావు అనుచరులు. వీరంతా ఇప్పుడు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి వివేక్ ప్రచారానికి దూరంగా ఉండటం స్థానికంగా చర్చనీయాంశ మవుతోంది. మరో విశేషమేమంటే వీరు కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి చిలుముల శంకర్‌కు మద్దతుగా పని చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో మండలానికి బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పీసీసీ కార్యదర్శి, మున్సిపల్ మాజీ ైచైర్మన్ సూరిబాబు వర్గం మాత్రమే వివేక్‌కు అండగా ఉన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో ప్రేంసాగర్‌రావు వర్గీయుడైన రేగాల మధుసూదన్‌ను వివేక్ తనవైపు తిప్పుకోగలిగారు. మంచిర్యాలలో.. మంచిర్యాల టిక్కెట్ కోసం ప్రేంసాగర్‌రావు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయడంతో అరవిందరెడ్డి పరిస్థితి అప్పట్లో ఆగమ్యగోచరంగా తయారైంది. కానీ అధిష్టానం మాత్రం ప్రేంసాగర్‌రావును సిర్పూర్‌కు పంపి, అరవిందరెడ్డికి మంచిర్యాల టిక్కెట్‌ను ఖరారు చేసిన విషయం విధితమే. అయితే ఇక్కడి టిక్కెట్ ఆశించిన ప్రేంసాగర్‌రావుకు మంచి ర్యాలలో అనుచరవర్గం ఉంది. ఈ వర్గం ఎన్నికల్లో అరవిందరెడ్డికి సహకరించడం లేదు. మంచిర్యాలకు చెందిన ఈ నాయకులంతా అరవిందరెడ్డికి ప్రచారం చేయకుండా, సిర్పూర్ వెళ్లి వారి నాయకునికి ప్రచారం చేస్తున్నారు. మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వంగల దయానంద్, మంచిర్యాల మండల శాఖ పార్టీ అధ్యక్షుడు సుంకి సత్యం, మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్‌రావు తదితరులు ప్రేంసాగర్‌రావు అనుచరులు. వీరు తమ సొంత నియోజకవర్గంలో కాకుండా, సిర్పూర్ వెళ్లి ప్రచారం నిర్వహించడం అరవిందరెడ్డికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఒకరిద్దరు నాయకులు సహకరించక పోయినా పెద్దగా నష్టమేమి ఉండదని ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. వివేక్, అరవిందరెడ్డిలు మాత్రం కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ వర్గపోరు ఎటువైపు దారితీస్తుందోనని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
కాంగ్రెస్‌లో కలకలం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మంచిర్యాల రాజకీయం రసకందాయంలో పడింది. మంచిర్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరవిందరెడ్డి బుధవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నా రు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని గట్టివాదనను వినిపించిన అరవిందరెడ్డి తాను కాంగ్రెస్‌లో చేరుతానని నెల రోజుల క్రితమే ప్రకటించారు. ఇటీవల తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ఉన్న సమయంలో కూడా అరవిందరెడ్డి తాను కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటన చేశారు. అనుకున్నట్లుగానే బుధవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. టిక్కెట్టు కోసం పెరిగిన పోటీ అరవిందరెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో నియోజకవర్గంలో టిక్కెట్టు కోసం మధ్య పోటీ పెరిగింది. తూర్పు జిల్లాలో ప్రధాన వాణిజ్య కేంద్రమైన మంచిర్యాల స్థానం జనరల్‌గా ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతల కన్ను ఈ నియోజకవర్గంపైనే ఉంది. ఈ టిక్కెట్టు కోసం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు పోటీ పడుతున్నారు. ఎవరికి వారే తమ అనుచరులను, ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. ఈ నియోజకవర్గంలోని పలు మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవుల విషయంలో ఈ ఇద్దరి నేతల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో రాహుల్‌గాంధీ దూత మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా ఇరువురు నేతలు ఆయన ముందు బలప్రదర్శనకు దిగారు. ఇప్పుడు తాజాగా అరవిందరెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరడంతో ఇక్కడ టిక్కెట్టు ఆశించే ముఖ్య నేతల మధ్య పోటీ పెరిగింది. టీఆర్ఎస్లో ఉన్నప్పటికీ అరవిందరెడ్డికి కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలు ఉన్నాయి. టిక్కెట్టు విషయంలో అరవిందరెడ్డికి స్పష్టమైన హామీ లభించిందని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. దివాకర్‌రావుకు స్థానికంగా పట్టుంది. గతంలో సీఎం కిరణ్‌తో ఉన్న సంబంధాలతో ప్రేంసాగర్‌రావు పలు మార్కెట్ కమిటీ చైర్మన్లను తన అనుచరులకు ఇప్పించుకో గలిగారు. దీంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయి చేరాయి. టీఆర్ఎస్ విలీనం, పొత్తులతో.. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం లేదా పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ విలీనం అయిన పక్షంలో ఈ సీటు కోసం పోటీ పడే నేతల సంఖ్య పెరుగుతుంది. టీఆర్ఎస్లో కొనసాగుతున్న మున్సిపల్ మాజీ చైర్మన్ కృష్ణారావు మంచిర్యాల నుంచి పోటీ చేయాలని ఆశలు పెట్టుకున్నారు. దీనికి తోడు పెద్దపల్లి ఎంపీ వివేక్ తన సతీమణిని ఇక్కడి నుంచి పోటీ చేయించే యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనమైతే ఈ టిక్కెట్టు కోసం పోటీ పడే ముఖ్యనేతల సంఖ్య ఏకంగా ఐదుకు చేరనుంది. దీంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఎవరికి టిక్కెట్టు దక్కుతుందో తెలియక తికమక పడుతున్నారు. -
రాజకీయం రసకందాయంలో
రాజకీయం రసకందాయంలో పడింది. మంచిర్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరవిందరెడ్డి బుధవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నా రు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని గట్టివాదనను వినిపించిన అరవిందరెడ్డి తాను కాంగ్రెస్‌లో చేరుతానని నెల రోజుల క్రితమే ప్రకటించారు. ఇటీవల తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ఉన్న సమయంలో కూడా అరవిందరెడ్డి తాను కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటన చేశారు. అనుకున్నట్లుగానే బుధవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. టిక్కెట్టు కోసం పెరిగిన పోటీ అరవిందరెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో నియోజకవర్గంలో టిక్కెట్టు కోసం నేతల మధ్య పోటీ పెరిగింది. తూర్పు జిల్లాలో ప్రధాన వాణిజ్య కేంద్రమైన మంచిర్యాల స్థానం జనరల్‌గా ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతల కన్ను ఈ నియోజకవర్గంపైనే ఉంది. ఈ టిక్కెట్టు కోసం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు పోటీ పడుతున్నారు. ఎవరికి వారే తమ అనుచరులను, ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. ఈ నియోజకవర్గంలోని పలు మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవుల విషయంలో ఈ ఇద్దరి నేతల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో రాహుల్‌గాంధీ దూత మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా ఇరువురు నేతలు ఆయన ముందు బలప్రదర్శనకు దిగారు. ఇప్పుడు తాజాగా అరవిందరెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరడంతో ఇక్కడ టిక్కెట్టు ఆశించే ముఖ్య నేతల మధ్య పోటీ పెరిగింది. టీఆర్ఎస్లో ఉన్నప్పటికీ అరవిందరెడ్డికి కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలు ఉన్నాయి. టిక్కెట్టు విషయంలో అరవిందరెడ్డికి స్పష్టమైన హామీ లభించిందని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. దివాకర్‌రావుకు స్థానికంగా పట్టుంది. గతంలో సీఎం కిరణ్‌తో ఉన్న సంబంధాలతో ప్రేంసాగర్‌రావు పలు మార్కెట్ కమిటీ చైర్మన్లను తన అనుచరులకు ఇప్పించుకో గలిగారు. దీంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయి చేరాయి. టీఆర్ఎస్ విలీనం, పొత్తులతో.. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం లేదా పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ విలీనం అయిన పక్షంలో ఈ సీటు కోసం పోటీ పడే నేతల సంఖ్య పెరుగుతుంది. టీఆర్ఎస్లో కొనసాగుతున్న మున్సిపల్ మాజీ చైర్మన్ కృష్ణారావు మంచిర్యాల నుంచి పోటీ చేయాలని ఆశలు పెట్టుకున్నారు. దీనికి తోడు పెద్దపల్లి ఎంపీ వివేక్ తన సతీమణిని ఇక్కడి నుంచి పోటీ చేయించే యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనమైతే ఈ టిక్కెట్టు కోసం పోటీ పడే ముఖ్యనేతల సంఖ్య ఏకంగా ఐదుకు చేరనుంది. దీంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఎవరికి టిక్కెట్టు దక్కుతుందో తెలియక తికమక పడుతున్నారు. -
నేను ఒంటరి కాదు...నాతో మరికొందరు
హైదరాబాద్ : తాను ఒక్కడినే కాదని.... తనతో పాటు మరికొంతమంది టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరతారని ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల శాసనసభ్యుడు అరవింద్ రెడ్డి తెలిపారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ ఫిబ్రవరి పదో తేదీ తర్వాత మరికొంతమంది తనతో వస్తారని అన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను ఈరోజు కలిసేందుకు ప్రయత్నిస్తామని అరవింద్ రెడ్డి తెలిపారు. 'తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టినందుకే టీఆర్ఎస్లో చేరిన. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆర్ చాలాసార్లు అన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ అవసరం ఏమిటి? తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞత ఉండొద్దా? కొందరిని ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేయడానికే టీఆర్ఎస్ పుట్టిందా?’ అని అరవింద్ రెడ్డి ప్రశ్నించారు. -
'నాతో పాటు మరికొంతమంది కాంగ్రెస్‌లోకి'
హైదరాబాద్ : ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ నేతలు తమ వ్యూహాలు మార్చుతున్నారు. ఏ పార్టీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్ ఉంటుందో ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుని జంప్ జిలానీలు అవుతున్నారు. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందే టీఆర్ఎస్లో కలహం మొదలయ్యింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కారు దిగి.. హస్తాన్ని అంది పుచ్చుకుంటున్నారు. తాజాగా మంచిర్యాల టీఆర్ఎస్ శాసన సభ్యుడు గడ్డం అరవింద్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. హస్తిన నుంచి తిరిగి వచ్చిన ఆయన తనతో పాటు మరికొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని అనుచ బాంబు పేల్చారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని చాలాసార్లు తాను కేసీఆర్‌కు చెప్పానన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘనత సోనియాగాంధీదేని అరవింద్ రెడ్డి కొనియాడారు. ‘తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ ఆవిర్భవించిన కారణం పూర్తయింది. తెలంగాణ ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీకి కృతజ్ఞత చూపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయకపోయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేయండి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలం అంతా మీ వెంటనే ఉంటాం. ఇంకా గడువును పెంచొద్దు’ అని దిగ్విజయ్ సింగ్‌కు అరవింద్‌రెడ్డి వివరించినట్లు సమాచారం. ఊహించని ఈ భేటీ టీఆర్ఎస్ను షాక్‌కు గురి చేసిందని, కాంగ్రెస్ వైఖరిపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. -
హస్తం గూటికి అరవిందరెడ్డి?
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి టీఆర్ఎస్కు రాంరాం చెప్పనున్నట్లు తెలిసింది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ గూటికి వెళ్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. వారం రోజులుగా ఆయన ఢిల్లీలో మకాం వేసి కాంగ్రెస్ ముఖ్యనేతలతో చర్చలు జరపడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది. రాష్ట్రపతి పంపిన తెలంగాణ బిల్లుపై శాసనసభలో సభ్యుల అభిప్రాయాలు చెబుతున్న ఈ కీలక తరుణంలో అరవిందరెడ్డి సభకు రాకుండా ఢిల్లీలో మంతనాలు సాగించడం టీఆర్‌ఎ్‌స్ అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. కొద్దికాలంగా ఆయన కాంగ్రెస్‌లో చేరుతారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. అరవిందరెడ్డి ఢిల్లీలో రెండుసార్లు కేంద్ర మంత్రి, సీనియర్ నేత జైపాల్‌రెడ్డితో భేటీ అయ్యారు. సోమ, మంగళవారం జైపాల్ నివాసానికి వెళ్లి చేరికపై సుదీర్ఘంగా చర్చించారని విశ్వాసనీయ సమాచారం. అరవిందరెడ్డి తండ్రి మాజీ ఎంపీ నర్సింహారెడ్డి జైపాల్‌రెడ్డికి సమకాలికుడు కావడంతో మంచి సంబంధాలు ఉన్నాయి. జైపాల్ మధ్యవర్తిగా దిగ్విజయ్‌సింగ్‌ని రహస్యంగా కలిశారని సమాచారం. ఫాంహౌస్‌లోనే విలీనం చేద్దామని కేసీఆర్‌కు ప్రతిపాదన కాంగ్రెస్ కోర్ కమిటీ తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి కేబినెట్లో తీర్మాణం చేసిన తరువాత పార్టీ పరిణామాలపై కేసీఆర్ గత సెప్టెంబర్‌లో తన ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలు, పొలిట్‌బ్యూరో సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అరవిందరెడ్డి టీఆర్ఎస్ను ఇచ్చిన మాట మేరకే కాంగ్రెస్‌లో విలీనం చేయాలని సూచించారు. కానీ, మిగతా ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఆయన అభిప్రాయంతో ఏకీభవించలేదు. ఆ రోజు నుంచే కాంగ్రెస్‌కు పోతాడని పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం మొదలుపెట్టింది. దీనికితోడు టీబీజీకేఎస్‌లో గ్రూపు విభేదాలు అరవిందరెడ్డిని పార్టీకి దూరం అవడానికి కొంత కారణంగా చెప్పవచ్చు. గుర్తింపు సంఘంగా గెలిచిన తరువాత 8 మెన్ కమిటీలో చోటు కోసం వివాదం మొదలైంది. యూనియన్ అధ్యక్షుడు మల్లయ్య ఒకగ్రూపుగా, ప్రధాన కార్యదర్శిగా రాజిరెడ్డి వర్గం మరోగ్రూపుగా తయారవగా రాజిరెడ్డి గ్రూపుకు అరవిందరెడ్డి సహకారం ఇస్తూ వచ్చాడు. ఈ విషయం పార్టీ నాయకత్వం దృష్టికి వె ళ్లడం, పార్టీలో అరవిందరెడ్డి గిట్టని వారు మల్లయ్యకు మద్దతు తెలుపడం చివరికి చినికిచినికి ఎమ్మెల్యేల విభజనకు దారితీసింది. అరవిందరెడ్డికి వ్యతిరేక వ ర్గం ఎమ్మెల్యేలు మల్లయ్యకు మద్దతిస్తూ వచ్చారు. ఇంత చేసి ఎన్నికల్లో యూనియన్ను గెలిపిస్తే ఇప్పుడు గెలిచిన తరువాత పార్టీ నాయకత్వం తన కంటే మల్లయ్య మాటకే ఎక్కువ విలువ ఇస్తుందని అరవిందరెడ్డి మనస్తాపం చెందారు. అరవిందరెడ్డి పార్టీ విడుతున్నాడని ప్రచారం జరగడంతో మల్లయ్య శిబిరంలో సంబరం నెలకొంది. ఈ విషయాన్ని వారే ప్రచారం చేయడం కొసమెరుపు. నాడు ప్రజాకోర్టుతో మొదలు.. కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన అరవిందరెడ్డి మొదటి నుంచి టీఆర్ఎస్లో ఇముడలేకపోతున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత అప్పటి సీఎం రాజశేఖరరెడ్డిని కలిసి కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. ఆక్రమంలో తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17, 2009న అరవిందరెడ్డి పార్టీ నాయకత్వంపై ధిక్కార స్వరం వినిపించారు. కేసీఆర్‌సహా అందరిపై ఆరోపణలు చేశారు. చివరికి టీఆర్ఎస్ మంచిర్యాలలో ఆయనపై ప్రజాకోర్టు పెట్టడంతో అది ఉద్రికత్తకు దారితీయడం తెలిసిందే. చివరికి అరవిందరెడ్డిని పార్టీ సస్పెండ్ చేసింది. అనంతరం రాజశేఖరరెడ్డి చనిపోవడం తరువాత నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం పెద్దయెత్తున ఉద్యమం జరుగడంతో మళ్లీ ఉద్యమంలో కలిసిపోయి పార్టీకి దగ్గరై పార్టీలో కొనసాగారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ బాటపడుతుండంతో నాటి ప్రజాకోర్టును గుర్తు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, అరవిందరెడ్డి పార్టీ మారుతున్నాడని ప్రచారం జరగడంతో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. బిల్లు పెడితే కాంగ్రెస్‌లో చేరుతా.. - ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారంపై అరవిందరెడ్డిని ‘న్యూస్‌లైన్’ ఫోన్లో సంప్రదించగా.. ‘నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదిస్తే టీఆర్ఎస్ విలీనం అయిన కాకపోయిన తాను మాత్రం కృతజ్ఞతగా కాంగ్రెస్‌లో చేరుతా’’ అని ఆయన తెలిపారు.