బాబు చేతిలో మందకృష్ణ కీలుబొమ్మ
హైదరాబాద్ : ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, కొప్పుల ఈశ్వర్, రాజయ్య మండిపడ్డారు. దళిత ఎమ్మెల్యేలు దొరల తొత్తులు అన్న మందకృష్ణ దళిత జాతికి క్షమాపణలు చెప్పాలని వారు గురువారమిక్కడ డిమాండ్ చేశారు.
మందకృష్ణ నియంత్రత్వ ధోరణితో మాదిగ నేతలంతా ఎమ్మార్పీఎస్ను వీడుతున్నారన్నారు. ఎన్నికల్లో మందకృష్ణ మూడుసార్లు పోటీ చేసినా ఎవరూ గెలిపించలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. దళిత సామాజిక న్యాయం టీఆర్ఎస్తోనే సాధ్యమని వారు వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలో తమ పార్టీ నిర్ణయిస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు.