
ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి
వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కా రం, సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి హితబోధ చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, వాటిలో ఎన్నింటిని పరిష్కరించారన్నది పరిశీలించుకోవాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై తొందరపాటు తగదని... ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా ప్రజల మౌలిక అవసరాలు, ప్రభుత్వ పాలన సరిగా అందేలా పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణలో తమ పార్టీ ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తోందని... ప్రజలు, రైతులు, కార్మికుల సమస్యలపై, మహిళాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.
శనివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు కొండా రాఘవరెడ్డి, వెల్లాల రామ్మోహన్, బండారు వెంకటరమణ, భగవంత్‌రెడ్డి తదితరులతో కలసి శ్రీకాంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో ముందుకు సాగుతామన్నారు. తెలంగాణలో తమ పార్టీ బలంగానే ఉందని, వచ్చే ఎన్నికల్లో తమ పట్టు నిరూపించుకుంటామన్నారు. పార్టీ నుంచి కొందరు నాయకులు బయటకు వెళ్లారని, శ్రేణులు మాత్రం పార్టీ వెంటే ఉన్నాయన్నరు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారంతా అభివృద్ధి కోసమే చేరామని చెబుతున్నారని..
మరి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట ఏమాత్రం అభివృద్ధి జరిగిందో, ఎన్ని నిధులు ఖర్చు చేశారో చెప్పాలన్నారు. తమ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై అనేకసార్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. కానీ ఆ ఎమ్మెల్యేలు ఇచ్చిన విలీన పత్రంపై రాత్రికి రాత్రే నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నిం చారు. ప్రస్తుతం పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టామని, 18-28 తేదీల మధ్య అన్ని మండలాల్లో పార్టీ అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే 9 జిల్లాల అధ్యక్షులను, 7 జిల్లాల్లో కమిటీలను నియమించామని వెల్లడించారు.