
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తీరుకు సిగ్గుపడాలి
హైదరాబాద్: అసెంబ్లీలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యులని, ఈ సంఘటనకు ప్రభుత్వం సిగ్గుపడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ నేతలు నాగం జనార్దన్‌రెడ్డి, చింతా సాంబమూర్తితో కలసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో అధికారపార్టీ సభ్యులు వ్యవహరించిన తీరు, శాసనసభ్యులపై దురుసుగా ప్రవర్తించడం వంటి చర్యలకు దిగడానికి సీఎం కేసీఆర్ పూర్తిస్థాయిలో బాధ్యత వహిం చాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించిన తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉందని విమర్శించారు.