ఆ హీరోయిన్‌కు చాలా సిగ్గంటా!
నాకు చాలా సిగ్గేస్తోందబ్బా అంటున్నారు నటి కాజల్ అగర్వాల్. ఏంటీ అబ్బా చా అనాలనిపిస్తోందా? మీరు ఏమైనా అనుకోండి. కాజల్ మాత్రం సిగ్గుతో పాటు, చాలా కష్టపడిపోతున్నారట. ఇంతకీ కాజల్ చెప్పొచ్చేదేమిటనేగా మీరు తెలుసుకోవాలనుకుంటోంది. అమ్మడు దక్షిణాదిలో నటించడం మొదలెట్టి దశాబ్దం దాటిపోయింది. ఇన్నాల్టికి ప్రేమ సన్నివేశాల్లో నటించడానికి చాలా సిగ్గేస్తోంది అంటున్నారు. ఆ సంగతేమిటో చూద్దాం రండి. సినిమాల్లో ముద్దు సన్నివేశాల్లో, ప్రేమ సన్నివేశాల్లో నటించడాన్ని ఒకప్పుడు ఎక్కువగా చర్చించుకునే వారు.
అలాంటి సన్నివేశాల్లో నటించడానికి కథానాయికలు సంశయించేవాళ్లు. అయితే అది రానురాను సర్వసాధారణంగా మారిపోయ్యింది. ఇప్పడు ఈత దుస్తుల్లో నటించడానికి కూడా అభ్యంతరం ఉండడం లేదు. అలాంటి సన్నివేశాలను ప్రేక్షకులు సాధారణంగా భావిస్తున్నారు. అయితే లిప్‌లాక్ సన్నివేశాలు, కథానాయకులతో సన్నిహితంగా నటించే సన్నివేశాల్లో నటించడానికి కథానాయికలు పడే కష్టం మాటల్లో చెప్పడం కష్టం. షూటింగ్ స్పాట్లో లైట్స్మేన్ల నుంచి ప్రొడక్షన్ వాళ్ల వరకూ పలువురు ఉంటారు. దర్శకులు, చాయాగ్రహకులు మా నటన ఎలా ఉంటుందోనని గుచ్చిగుచ్చి చూస్తుంటారు. అలాంటప్పుడు పొట్టిలంగా ఓణీలు లాంటివి ధరించి లిప్‌లాక్ సన్నివేశాలు, హీరోలతో ప్రేమ సన్నివేశాలల్లో సన్నిహితంగా నటించడం నాకు మాత్రం చాలా సిగ్గేస్తుంది.
కొన్ని సందర్భాల్లో సాధారణ జనం షూటింగ్ చూడడానికి వస్తుంటారు. వారి ముందు అలాంటి సన్నివేశాల్లో నటించడం సాధారణ విషయం కాదు. నేను మాత్రం చాలా కష్టపడతాను. నేను ఈ రంగంలో అడుగు పట్టి పదేళ్లు దాటింది. ప్రముఖ నటులందరితోనూ కలిసి నటించాను. ప్రస్తుతం తమిళంలో అజిత్‌కు జంటగా వివేకం, విజయ్‌తో ఒక చిత్రం చేస్తున్నాను. తెలుగులో రానాతో కలిసి నేనే రాజా నేనే మంత్రి చిత్రంలో నటిస్తున్నాను. ఇకపై నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటించాలని నిర్ణయించుకున్నానంటున్న కాజల్ ఇంతకు ముందు నేను పక్కాలోకల్ అంటూ ఐటమ్ సాంగ్‌లో ఎలా ఇరగదీసిందో మరి. చెప్పడానికే నీతులు అని పెద్దోళ్లు ఊరికే అనలేదు మరి.