మహబూబ్‌నగర్ జిల్లాపరిషత్ సమావేశం రసాభాసగా మారింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వివాదం జరిగింది.
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లాపరిషత్ సమావేశం రసాభాసగా మారింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వివాదం జరిగింది. శుక్రవారం సమావేశం ప్రారంభమైన తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు, టీడీపీ ఎమ్మెల్యే రాజేంద్రరెడ్డిలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు.
ఆ తర్వాత టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాలరాజు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిల మధ్య కూడా వాదులాట జరిగింది. దీంతో బాలరాజు పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. టీఆర్‌ఎస్ సభ్యులు మాట్లాడుతుండగా వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు.