సముద్రంలో నీటిబిందువు రేవంత్‌ | Trs Mla's comments with congress leader jeevan reddy about revanth reddy issue | Sakshi
Sakshi News home page

సముద్రంలో నీటిబిందువు రేవంత్‌

Published Tue, Oct 31 2017 6:50 AM | Last Updated on Thu, Mar 21 2024 8:30 PM

ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరికపై అసెంబ్లీ మీడియా పాయింట్‌లో సోమవారం ఆసక్తికర చర్చ జరిగింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డితో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎ.జీవన్‌రెడ్డిల మాటా ముచ్చట ఆసక్తిగా సాగింది. ముగ్గురి మధ్య.. ఏది ధర్మం.. ఏది న్యాయం.. అన్న పాయింట్‌ నుంచి మొదలైన సంభాషణ రేవంత్‌ చేరిక వరకు వెళ్లింది. ‘తెలంగాణ ఇచ్చినందుకు ధర్మం తప్పకుండా సోనియాగాంధీ ఇంటికెళ్లి కేసీఆర్‌ కలవటం న్యాయమే.. అయితే మా వాళ్లు ఎన్నికల్లో కలుపుకోకుండా తప్పు చేశారు’అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ‘మీరు కలుపుకోనందుకే టీఆర్‌ఎస్‌ గెలిచి.. తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగింది’అని ముత్తిరెడ్డి బదులుగా స్పందించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement