'తెలంగాణకు శనిలా దాపురించాడు' | TRS MLAs Takes on TDP Chief Chandrababu naidu | Sakshi
Sakshi News home page

'తెలంగాణకు శనిలా దాపురించాడు'

Published Sun, Nov 23 2014 11:56 AM | Last Updated on Sat, Aug 11 2018 2:53 PM

'తెలంగాణకు శనిలా దాపురించాడు' - Sakshi

'తెలంగాణకు శనిలా దాపురించాడు'

హైదరాబాద్: తెలంగాణలో అసలే టీఆర్ఎస్, టీడీపీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. కాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయించడంతో ఆ రెండు పార్టీల మధ్య ఉన్న వైరాన్ని మరింత పెంచింది. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కు ఎన్టీఆర్ పేరును పెట్టవద్దంటూ తెలంగాణ అసెంబ్లీ శుక్రవారం తీర్మానించింది. దీంతో ఆగ్రహించిన ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీపీ నేతలు శనివారం అధికార టీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు.

దాంతో ఆదివారం హైదరబాద్లో టీఆర్ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీనివాసగౌడ్, గంగుల కమలాకర్ మాట్లాడుతూ... టీడీపీ అధ్యక్షడు, ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణకు చంద్రబాబు శనిలా దాపురించారని ఆరోపించారు. చంద్రబాబుకు తెలంగాణలో ఉండే అర్హత లేదన్నారు. స్పీకర్పై ప్రతిపక్ష టీటీడీపీ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం ఇస్తే అధికార బీసీ ఎమ్మెల్యేలంతా ఏకమై... ఆ అవిశ్వాస తీర్మానాన్ని వీగిపోయేలా చేస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement