
దొరతనానికి శుభదినం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: మంత్రి హరీశ్ రావు ఉసిగొల్పడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ సభ్యులపై దాడి చేశారని టీడీపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు మేరకు తమపై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ పై చర్య తీసుకోవాలన్నారు. తెలంగాణ ఉభయసభల్లో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.... 'ప్రజాస్వామ్యానికి దుర్దినం, దొరతనానికి శుభదినం' అని వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ లో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని గవర్నర్ ను కోరినా పెడచెవిన పట్టడంతో ఆయన ప్రసంగానికి నిరసన తెలపాలనుకున్నామని చెప్పారు. తమను అడ్డుకున్న మార్షల్స్ పై చర్య తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.