చంద్రబాబు నాయుడు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానం తేల్చింది. ఈ కేసులో CID పెట్టిన సెక్షన్ 409 వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్‌ను విధించారు న్యాయమూర్తి. కేసులో నేరతీవ్రత ఉందన్న వాదనలతో కోర్టు ఏకీభవిస్తోందని న్యాయమూర్తి తన తీర్పులో తెలిపారు.
ACB కోర్టులో వాట్ నెక్ట్స్ ?
కోర్టులో తీర్పు వెలువడగానే.. చంద్రబాబు లాయర్లు అలర్టయ్యారు. రిమాండ్ తప్పదని అప్పటికే నిర్దారణకు వచ్చిన లాయర్లు సాయంకాలానికే బెయిల్ పిటిషన్ సిద్ధం చేసి పెట్టుకున్నారు. తీర్పు వెలువడగానే వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ కోర్టులోరేపు విచారణ జరిగే అవకాశం ఉంది.
ఇటు ACB కోర్టులో CID కూడా ఒక పిటిషన్ వేసింది. చంద్రబాబును వారం రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇవ్వాలంటూ పిటీషన్ వేసింది.
ఇక రిమాండ్ విధించిన వెంటనే మరో రెండు పిటిషన్లు దాఖలు చేసింది చంద్రబాబు న్యాయవాదుల బృందం.
1. గృహనిర్బంధంలో ఉంచేందుకు అనుమతించాలని పిటిషన్
2. ఇంటి భోజనం, మందులు ఇచ్చేందుకు మరొక పిటిషన్
హైకోర్టుకు చంద్రబాబు లాయర్లు
ఏసీబీ కోర్టు తీర్పుపై రేపు హైకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిసింది.
రేపు, సోమవారం ఉదయం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని చంద్రబాబు లాయర్లు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుగుదేశం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
రాజమండ్రి రెడీ
చంద్రబాబును తరలిస్తారన్న సమాచారంతో రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు.. వేర్వేరు ఏర్పాట్లు చేస్తున్నారు. జైలు ఆవరణలో భారీగా పోలీసు భద్రతతో పాటు బారికెడ్లు ఏర్పాటు చేశారు. ఇవ్వాళ విజయవాడ ACB కోర్టులో తెలుగుదేశం శ్రేణుల వీరంగాన్ని దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు
చదవండి: Babu @ Jail : న్యాయం గెలిచింది!
Comments
Please login to add a commentAdd a comment