
సికింద్రాబాద్ విధ్వంసం ఫొటోలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పెనువిధ్వంసమే సృష్టించారు ఆందోళనకారులు. అయితే ఈ విధ్వంసం కేసులో.. అల్లర్ల నిందితులకు బుధవారం రిమాండ్ విధించింది కోర్టు.
‘సాయి అకాడమీ’ సుబ్బారావు సహా 15 మందిని కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. సుబ్బారావు పాత్రపై కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. ఇక పృథ్వీరాజ్ అనే అదిలాబాద్ వాసి.. విధ్వంసంలో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అలాగే పరారైన 25 మంది నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment