శంషాబాద్: శంషాబాద్ పట్టణంలో ఓ కానిస్టేబుల్ పీకల దాకా మద్యంతాగి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. పోలీసులు,స్థానికులు తెలిపిన మేరకు..ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రాజమల్లయ్య (35) మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కొత్వాల్‌గూడ ఔటర్‌రింగ్ రోడ్డు సర్వీసు రోడ్డులో తన కారును రోడ్డుకు అడ్డంగా పెట్టాడు.
ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వాహనాలను ఆపి డబ్బు వసూలుకు కూడా పాల్పడ్డాడని పేర్కొన్నారు. గచ్చిబౌలి నుంచి వస్తున్నఅశ్విన్ రెడ్డి దంపతులను కారు ఆపి అసభ్యకరంగా మాట్లాడడంతో వారు 100 ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆర్‌జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment