సాక్షి, అమరావతి: నిందితుడిని రిమాండ్‌కు పంపే సమయంలో అందుకుగల కారణాలను మేజిస్ట్రేట్‌లు తప్పనిసరిగా రికార్డ్‌చేసి తీరాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. వారు యాంత్రికంగా వ్యవహరించకుండా కేసు పూర్వాపరాలను పరిగణనలోకి తీసుకుని ఆ తరువాతే సహేతుక ఉత్తర్వులు జారీచేయాలని స్పష్టంచేసింది.
రిమాండ్ ఉత్తర్వులు లోపభూయిష్టంగా ఉన్నట్లు తాము (హైకోర్టు) గమనించినా, నిందితుల తరఫున తమ దృష్టికి తీసుకొచ్చినా ఆ మేజిస్ట్రేట్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది.
రిమాండ్ కారణాలను రికార్డ్ చేయాల్సిందే
Published Wed, Mar 9 2022 4:47 AM | Last Updated on Wed, Mar 9 2022 4:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment