ప్రతీ సందర్భాన్నీ తన రాజకీయ అవసరానికి వాడుకోవడం బాబుగారికి వెన్నతో పెట్టిన విద్య. చివరికి భారీ స్కామ్‌కు పాల్పడి అరెస్ట్ అయిన ప్రస్తుత సందర్భాన్ని కూడా తనకు అనుకూలంగా మలచుకోవడానికే చంద్రబాబు చూస్తున్నారు. ఒకవైపు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఏదో పైకి మొక్కుబడిగా మీడియా ముఖంగా చెప్పిన బాబు.. అందుకు భిన్నంగా వ్యవహరించాలని పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేసేశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రధాన సూత్రధారి, పాత్రధారి చంద్రబాబేనని సీఐడీ దర్యాప్తులో తేలిన తర్వాత అరెస్ట్ చేస్తే, అందులో సానుభూతిని సంపాదించుకోవడం చూస్తున్నాడు. నంద్యాలలో చంద్రబాబను అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడ కోర్టుకు తరలించే క్రమంలో పెద్ద హైడ్రామే నడిచింది. చంద్రబాబు వయసు, హోదా దృష్ట్యా హెలికాప్టర్‌లో తరలిస్తామని చంద్రబాబుకు సీఐడీ సూచన చేయగా, హెలికాప్టర్‌లో తరలింపు వద్దని చంద్రబాబు నిరాకరించడమే కాకుండా తన కాన్వాయ్‌లోనే వస్తానంటూ పట్టుబట్టారు. దాంతో చేసేది లేక చంద్రబాబు కాన్వాయ్‌లోనే విజయవాడకు తరలించేందుకు అంగీకరించింది సీఐడీ.
ఇక్కడ చంద్రబాబు ఉద్దేశం ఏమిటో క్లియర్‌గా అర్ధం అవుతోంది. ఎలాగోలా ఉద్రిక్తతలను రెచ్చగొట్టి సానుభూతి పొందాలనే తపనే కనిపించింది బాబు గారిలో..
దానిలో భాగంగా తనను తీసుకెళ్లే కాన్వాయ్‌ను అడ్డుకోవాలంటూ టీడీపీ శ్రేణులకు, పార్టీ నేతలకు సూచించారు చంద్రబాబు. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులను రెచ్చగొట్టి తద్వారా దాని ద్వారా వచ్చిన మైలేజ్ పొందాలని ప్లాన్ చేసుకున్నారు చంద్రబాబు. అందుకే ఆకాశ మార్గం గుండా కాకుండా రోడ్డు మార్గంలోనే వెళదామని పట్టుబట్టడానికి ప్రధాన కారణం.
ఇలా తనను రోడ్డు మార్గంలో తీసుకెళ్లే సమయంలో ఆందోళనలకు దిగాలని పిలుపునిచ్చారు బాబుగారు. అదే సమయంలో తమకు తెలియకుండా రూటు మార్చుతున్నారంటూ ఎల్లో మీడియా వార్తలు ఇవ్వసాగింది. ఒకవేళ చంద్రబాబును విజయవాడకు తీసుకెళ్లే క్రమంలో రూట్ మార్చాలంటే ఎల్లో మీడియా పర్మిషన్ అవసరమా? అనే ప్రశ్న తలెత్తక మానదు. చంద్రబాబును ఎలా తీసుకెళ్లాలన్నది పోలీసులకు తెలియదా?, ఎక్కడకు తీసుకెళుతున్నారు అనే విషయంపై క్లారిటీ ఉన్నప్పుడు.. ఎలా తీసుకెళుతున్నారు అనే విషయం అనవసరం. ఇటువంటి హైప్రొఫైల్ కేసులో అరెస్ట్‌లు జరిగినప్పుడు ఎలా తీసుకెళుతున్నారనే రూట్ మ్యాప్ అనేది తెలియకపోవడమే బెటర్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట.
ఎంత పకడ్బందీగా చంద్రబాబును అధికారులు తరలించే యత్నం చేసినప్పటికీ టీడీపీ శ్రేణులు పలుమార్లు కాన్వాయ్‌లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించడం గమనార్హం. దాంతో ఏ ఇతర వాహనాన్ని చంద్రబాబు కాన్వాయ్‌కు సమీపంగా రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు.
మరొకవైపు కాన్వాయ్‌లో 108 ఉన్నా.. అంబులెన్స్ లేదంటూ తప్పుడు వార్తలు ఇచ్చింది ఎల్లో మీడియా. అరెస్ట్ చేసి తీసుకెళుతుంటే ఎన్ని వాహనాలు ఉండాలో కూడా ఎల్లో మీడియా చెప్పేస్తుంది. అసలు ఎన్ని వాహనాలు ఉండాలు అన్నది పోలీసులు నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది కానీ ఎల్లో మీడియా, టీడీపీ శ్రేణులో చెప్పినట్లు నడవదు.
Comments
Please login to add a commentAdd a comment